సినిమాల్లో ఆయన బిజీ.. మరి మా గతేంటి.. హిందూపూర్ వాసుల మొర..

TDP Local Leaders Comments On BalaKrishna, సినిమాల్లో ఆయన బిజీ.. మరి మా గతేంటి.. హిందూపూర్ వాసుల మొర..

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ లుక్ మార్చి అదరహో అనిపిస్తున్నారు. ప్రజా ప్రతినిధిగా కాదు.. నటసింహం బాలయ్యగా.. కేఎస్ రామారావు దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలకృష్ణ న్యూ లుక్ సినీ ఇండస్ట్రీనే కాదు. పొలిటికల్ సర్కిల్స్ ని కూడా ఆకర్షించింది. సినిమా కోసం వెయిట్ తగ్గి ఔట్ అండ్ ఔట్ క్లాస్ లుక్ తో కేకపుట్టించేశారు. దాంతో బాలకృష్ణ తన ఫుల్ ఫోకస్ సినిమాలమీద పెట్టేశారంటూ.. పార్టీలో చర్చసాగుతోంది. దాంతో దొరికిందే సందు అని వైసీపీ ఆపరేషన్ హిందూపురం మొదలుపెట్టింది. అయితే పార్టీ ప్రస్తుతం పరిస్థితుల్లో బాలకృష్ణ సినిమాలను పక్కన పెట్టి, ఫుల్ టైమ్ పాలిటిక్స్ పై ఫోకస్ చెయ్యాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో లాగా 2 నెలలకోసారి వచ్చి భూమి పూజలు, శంకుస్థాపనలు చేస్తే చాలదని అంటున్నారు. గతంలో సమస్యలు చెప్పుకోడానికి నియోజకవర్గంలో పీఏలను అందుబాటులో ఉంచేవారని, దానివల్ల కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ఈసారైనా బాలకృష్ణ పూర్తి సమయం తమకు అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుతున్నారు.

మరోవైపు హిందూపురంలో బాలకృష్ణ మీద పోటీ చేసి ఓడిపోయిన ఇక్బాల్ ఇప్పుడు ఎమ్మెల్సీ కావడంతో హిందూపురానికి ఆయనే అనధికార ఎమ్మెల్యే అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో మొదలైంది. హిందూపురంలో మైనారిటీ ఓటు బ్యాంకు కూడా బలంగా ఉంది. అటు మైనారిటీ ఓటర్లను ఆకర్షించడం, ఇటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను ఆకట్టుకోవడం… డబుల్ వ్యూహంతో ఇక్బాల్ పావులు కదుపుతున్నారు. 2024 లో నందమూరి కోటలో పాగా వేయాలని ఇక్బాల్ పక్కా ప్లాన్ చేస్తుంటే.. బాలయ్య మాత్రం సినిమాలవైపు మొగ్గు చూపడం చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *