సీఎం చంద్రబాబు ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తల నిరసన

అసెంబ్లీ, లోక్‌సభకు అభ్యర్థుల ఎంపిక ఫైనల్ అవుతున్న కొద్దీ ఆశావాహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. తమకు టికెట్ వస్తుందో లేదో.. రాకపోతే తమ వ్యతిరేకవర్గానికి టికెట్ వస్తుందా అని ఉత్కంఠ నేతల్లో నెలకొంది. ఇక కొంతమంది నేతలు ఆయా పార్టీ ఆఫీస్‌ల ముందుకు వచ్చి ఆందోళనకు దిగుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. అమరావతిలోని టీడీపీ ఆఫీస్, హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ దగ్గర సేమ్ టూ సేమ్ వాతావరణమే కనిపిస్తోంది. టికెట్ల పంచాయితీ ఫైటింగ్ వరకు వెళ్లింది. ఒక వర్గానికి […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:27 pm, Wed, 13 March 19

అసెంబ్లీ, లోక్‌సభకు అభ్యర్థుల ఎంపిక ఫైనల్ అవుతున్న కొద్దీ ఆశావాహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. తమకు టికెట్ వస్తుందో లేదో.. రాకపోతే తమ వ్యతిరేకవర్గానికి టికెట్ వస్తుందా అని ఉత్కంఠ నేతల్లో నెలకొంది. ఇక కొంతమంది నేతలు ఆయా పార్టీ ఆఫీస్‌ల ముందుకు వచ్చి ఆందోళనకు దిగుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. అమరావతిలోని టీడీపీ ఆఫీస్, హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ దగ్గర సేమ్ టూ సేమ్ వాతావరణమే కనిపిస్తోంది.

టికెట్ల పంచాయితీ ఫైటింగ్ వరకు వెళ్లింది. ఒక వర్గానికి టికెట్ ఇవ్వొద్దని కొందరు.. మాకే ఇవ్వాలంటూ మరో వర్గం వ్యతిరేక అనుకూల నినాదాలు చేస్తూ ఘర్షణకు దిగుతున్నాయి. అమరావతిలోని టీడీపీ ఆఫీస్ దగ్గర టికెట్ల కోసం డిమాండ్ చేస్తూ కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు.

పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వొద్దంటూ అసమ్మతి వర్గం నేతలు ఆందోళనకు దిగారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మొడియంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న కుర్చీలను గాల్లోకి విసిరేశారు. బారీకేట్లను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న అనుకూల వర్గం నేతలు కూడా ప్రతి నినాదాలు చేశారు. అసమ్మతి, అనుకూల వర్గాల మధ్య తోపులాట వాగ్వాదం జరిగింది.