AP Assembly : అసెంబ్లీలో మంత్రి అనిల్ కీలక ప్రకటన.. అమరావతిని మార్చడం లేదు.. కానీ..

| Edited By: Ravi Kiran

Updated on: Dec 04, 2020 | 4:56 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే టీడీపీ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు.

AP Assembly : అసెంబ్లీలో మంత్రి అనిల్ కీలక ప్రకటన.. అమరావతిని మార్చడం లేదు.. కానీ..

AP Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే టీడీపీ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. పెండింగ్‌లో ఉన్న రూ.2500 కోట్ల ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం ముందు నిరసన చేపట్టారు. అయితే చివరి రోజు సమావేశాలు కావడంతో కీలక బిల్లుపై చర్చించాల్సి ఉందని, సహకరించాలని స్పీకర్ టీడీపీ నేతలను కోరారు. అయినప్పటికీ టీడీపీ నేతలు తమ నిరసనను కొనసాగించారు. స్పీకర్ పోడియం ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా, టీడీపీ నేతలు స్పీకర్ పోడియం ఎక్కడంతో స్పీకర్ తమ్మినేని సీతారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని హితవుచెప్పారు. అయినప్పటికీ వినకపోవడంతో 10 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Dec 2020 01:44 PM (IST)

    బంజారాహిల్స్‌ కౌంటింగ్‌ కేంద్రంలో ఉద్రిక్తత…

    బంజారాహిల్స్‌ కౌంటింగ్‌ కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓట్ల లెక్కింపు గల్లంతవుతోందని ఏజెంట్‌లు ఆందోళనకు దిగారు. డివిజన్లు 92, 93, 94, 95కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా వెంకటేశ్వర కాలనీ డివిజన్ లెక్కింపు కేంద్రంలో ఇరు పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు.

  • 04 Dec 2020 01:27 PM (IST)

    AP Assembly: అసెంబ్లీలో మంత్రి అనిల్ కీలక ప్రకటన.. అమరావతిని మార్చడం లేదు.. కానీ..

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజధాని అమరావతిపై ఆసక్తికర చర్చ జరిగింది. అమరావతి మార్పు అంశం సభలో చర్చకు రాగా, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ సందర్భంగా అమరావతి మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మార్చడం లేదని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. అయితే అమరావతితో పాటు మరో రెండు రాజధానులను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అమరావతి లెజిస్లేటీవ్ రాజధానిగా కొనసాగుతుందని, మిగితా రెండు ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌గా, జ్యూడీషియల్ క్యాపిటల్‌గా ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి అని చెప్పుకొచ్చారు.

  • 04 Dec 2020 11:28 AM (IST)

    AP Assembly live Updates: టీడీపీ నేతల తీరుపై మంత్రి కన్నబాబు ఫైర్... కావాలనే ఇలా చేస్తున్నారంటూ...

    AP Assembly live Updates: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల వ్యవహార శైలిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక ప్లాన్ ప్రకారం కావాలనే సభలో గంగదరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రతి రోజు సభలో ఏదో ఒక హడావుడి చేసి.. ఆందోళనలు, నిరసనలతో తప్పించుకుని తిరగాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించే శ్రద్ధ లేకుండా, కేవలం వారి స్వప్రయోజనాల కోసం సభను విడిచి వెళ్లిపోయే కార్యక్రమం చేపడుతున్నారని దుయ్యబట్టారు. ఏ అంశంపై అయినా చర్చించేందుకు తాము సిద్ధం అంటుంటే.. ప్రతిపక్ష టీడీపీ సభ్యులు మాత్రం ఆందోళనల పేరుతో సభ నుండి బయటకు వెళ్లిపోతున్నారని మండిపడ్డారు.

Published On - Dec 04,2020 1:44 PM

Follow us