కేసీఆర్ ను ఆకాశానికెత్తుతున్న ఏపీ టీడీపీ నేతలు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మీద ఎన్నో సందర్భాల్లో టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డం తెలిసిందే. టీడీపీ-టీఆర్ఎస్ పార్టీ లీడర్ల మధ్య వైరం కూడా అదేస్థాయిలో..

కేసీఆర్ ను ఆకాశానికెత్తుతున్న ఏపీ టీడీపీ నేతలు
Follow us

|

Updated on: Sep 06, 2020 | 7:00 PM

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మీద ఎన్నో సందర్భాల్లో టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డం తెలిసిందే. టీడీపీ-టీఆర్ఎస్ పార్టీ లీడర్ల మధ్య వైరం కూడా అదేస్థాయిలో ఉంటుంది. అయితే, ఇప్పుడు మాత్రం ఏపీ టీడీపీ నేతలు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పేందుకు క్యూ కడుతున్నారు. విశ్వవిఖ్యాత కథానాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జీవితచరిత్రను తెలంగాణలో పాఠ్యాంశంగా చేర్చడమే దీనికి కారణం. టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్, బాలయ్య సహా దేవినేని ఉమ, బుద్దా వెంకన్న వంటి అనేక మంది సీనియర్ తెలుగుదేశం పార్టీ నేతలు నిన్ననే కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తగా.. ఇప్పుడు మరో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంతు వచ్చింది. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ… ఎన్టీఆర్ యుగపురుషుడు.., అటు సినిమా రంగం, ఇటు రాజకీయాల్లో రాణించి తెలుగుదనానికి వన్నె తెచ్చిన మహానుభావుడు అని కీర్తించారు. ఇప్పుడు ఎన్టీఆర్ చరిత్రను తెలంగాణలో పాఠ్యాంశంగా చేర్చడం చాలా సంతోషం కలిగిస్తోందని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సోమిరెడ్డి వెల్లడించారు.