Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

ఏపీలో పరువు నష్టం దావాల హోరు

difirmation cases issue rocking, ఏపీలో పరువు నష్టం దావాల హోరు

మూడు రాజధానుల ప్రస్తావన ఏమో గానీ ఇపుడు ఏపీలో పరువునష్టం దావాలు హోరెత్తిస్తున్నాయి. రాజధాని ఏరియాలో భూములు మీరు కొన్నారంటే మీరు కొన్నారంటూ వైసీపీ, టీడీపీ నేతలు వాదులాడుకుంటున్నారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే పార్టీ నేతలకు లీక్ చేశారని, దాంతో టీడీపీ నేతలు అమరావతిలో భూములను కొని ఇన్‌సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు గురువారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

వైసీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, పరిటాల శ్రీరాం, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ళ నరేంద్ర వంటి వారికి భూములున్నట్లు పేర్కొన్నారు. దాంతో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. భూములు లేనివారిని, ఎప్పుడో గతంలో భూములు కొన్న వారిని ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణల పరిధిలోకి తేవడాన్ని వారు ఖండించారు. కంభంపాటి వంటి నేతలు తాము 2006లో కొన్న భూములను 2014 తర్వాత కొన్నట్లుగా వైసీపీ నేతలు పేర్కొని, తన పరువుకు నష్టం కలిగించారంటూ డిఫర్మేషన్ కేసు వేసేందుకు రెడీ అవుతున్నట్లు ప్రకటించారు. పరిటాల శ్రీరామ్, ధూళిపాళ్ళ నరేంద్ర కూడా వైసీపీ నేతలపై పరువునష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు.

మరోవైపు తాజాగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ప్రకటించే ముందే వైసీపీ నేతలు వైజాగ్‌లో పెద్ద ఎత్తున భూములు కొన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బొత్స సత్యనారాయణతోపాటు పలువురు వైసీపీ నేతలు విశాఖలో భూములు కొన్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్లో నిజం లేదంటున్న వైసీపీ నేతలు ఈ ఆరోపణలు చేసిన తెలుగుదేశం నాయకులపై పరువునష్టం దావాలను వేస్తామని ప్రకటిస్తున్నారు.

మొత్తమ్మీద రాజధాని రచ్చ ఏమో గానీ భూముల కొనుగోళ్ళే ఇప్పుడు టీడీపీ, వైసీపీ నేతల మధ్య పంచాయితీకి దారితీస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా భూములు కొన్నారో తేలేది.. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నిగ్గు తేల్చేది ఇక న్యాయస్థానాలేనేమో!

Related Tags