టీడీపీ నేతలకు కేసుల భయం..!

మొన్నటి వరకు వారు చెప్పిందే రాజ్యం.. వారు చేసించే శాసనం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఏం చేసినా బెడిసి కొడుతున్నాయి. టీడీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. టీడీపీ హయాంలో చక్రం తిప్పిన నేతలకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. 12 రోజులు కనిపించకుండా పోయిన చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 52 కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో చింతమనేనిని అరెస్ట్ చేసిన పోలీసులు అన్ని కేసులకు సంబంధించి మరింత ఉచ్చు బిగించే […]

టీడీపీ నేతలకు కేసుల భయం..!
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 2:19 PM

మొన్నటి వరకు వారు చెప్పిందే రాజ్యం.. వారు చేసించే శాసనం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఏం చేసినా బెడిసి కొడుతున్నాయి. టీడీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. టీడీపీ హయాంలో చక్రం తిప్పిన నేతలకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. 12 రోజులు కనిపించకుండా పోయిన చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 52 కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో చింతమనేనిని అరెస్ట్ చేసిన పోలీసులు అన్ని కేసులకు సంబంధించి మరింత ఉచ్చు బిగించే యత్నంలో ఉన్నారు. మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఓ వెలుగు వెలిగిన చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ తో నెక్ట్స్ ఎవరనే ప్రచారం ఏపీలో జోరందుకుంది. తాజాగా మహిళా ఎస్సైను దూషించారన్న ఆరోపణపై టీడీపీ మహిళానేత నన్నపనేని రాజకుమారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నన్నపనేనిపై కేసుపెట్టాలన్న డిమాండ్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. మరోవైపు భూ కబ్జా కేసులో కుటుంబరావుపై ఇప్పటికే ఉచ్చు బిగుస్తోంది. విజయవాడలో 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని పట్టా ల్యాండ్ గా చూపిస్తూ సొంతం చేసుకున్నారన్న విమర్శల నేపధ్యంలో కుటుంబరావుకు చెక్ పెట్టింది ప్రభుత్వం.

ఇక ప్రభుత్వ అధికారులను బెదిరించారన్న దానిపై మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తో పాటు మరో 11 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఏ క్షణంలోనైనా అరెస్ట్ కాక తప్పదన్న ప్రచారం సాగుతోంది. ఇటు ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కూడా నోటీసులు వెళ్లాయి. బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయనకూ అరెస్ట్ తప్పేలా లేదు. ఇలా ఒకరూ.. ఇద్దరూ కాదు.. చాలామంది నేతలు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ప్రభుత్వం నీటిపారుదల శాఖామంత్రిగా ఉన్న దేవినేని ఉమను టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు సాగుతున్నాయి.