వివేకానంద రెడ్డి మర్డర్ మిస్టరీ: చిక్కుల్లో జగన్..!

వైఎస్‌ వివేకానంద మర్డర్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎన్నికలకు ముందే ఈ హత్య జరగడంతో.. అప్పటి సీఎం.. చంద్రబాబు దీనిపై వెంటనే స్పందించి సిట్ వేయించారు. అనంతరం ప్రభుత్వం మారగా.. వివేకాను ఎవరు హత్య చేయించారో.. వెంటనే తెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. జగన్.. సీఎం అయి మూడు నెలలు కావొస్తున్నా.. ప్రయోజనం లేదు. నిందితులను.. అటూ.. ఇటూ.. కోర్టులని.. వివిధ రకాల టెస్టులనీ తిప్పుతూ వచ్చారు అధికారులు. ఇప్పటికి ఈ మర్డర్‌పై 5 సిట్‌‌లు […]

వివేకానంద రెడ్డి మర్డర్ మిస్టరీ: చిక్కుల్లో జగన్..!
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2019 | 5:07 PM

వైఎస్‌ వివేకానంద మర్డర్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎన్నికలకు ముందే ఈ హత్య జరగడంతో.. అప్పటి సీఎం.. చంద్రబాబు దీనిపై వెంటనే స్పందించి సిట్ వేయించారు. అనంతరం ప్రభుత్వం మారగా.. వివేకాను ఎవరు హత్య చేయించారో.. వెంటనే తెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. జగన్.. సీఎం అయి మూడు నెలలు కావొస్తున్నా.. ప్రయోజనం లేదు. నిందితులను.. అటూ.. ఇటూ.. కోర్టులని.. వివిధ రకాల టెస్టులనీ తిప్పుతూ వచ్చారు అధికారులు. ఇప్పటికి ఈ మర్డర్‌పై 5 సిట్‌‌లు వేశారు. అయినా.. ఎలాంటి.. కొత్త నిజాలు బయటకు రాలేదు.

కాగా.. సొంత బాబాయిని మర్డర్ చేసి జగన్..ఎన్నికల్లో గెలిచారంటూ.. టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికే.. వివేకా హత్య జరిగి మూడు నెలలు కావొస్తున్నా.. ఈ మిస్టరీని మాత్రం చేధించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. జగన్ సన్నిహితులు.. ఈ కేసులో ఉన్నారని.. అందుకే ఈకేసును ఎటూ తేల్చలేకపోతున్నారని తీవ్రంగా దూయబడుతున్నారు టీడీపీ నేతలు.

మరోపక్క జగన్‌పై ఇంటి సభ్యుల అసహనం కూడా ఎక్కవయ్యింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తినే ఏమీ చేయలేకపోవడమేంటని.. ప్రశ్నలు వస్తున్నాయి. ఇవన్నీ ఇప్పడు సీఎం జగన్ మెడకు చుట్టుకుంటున్నాయి. వివేకా మర్డర్ మిస్టరీ తేలకపోవడంతో.. కుటుంబీకులు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు రాజకీయంగానూ.. ఈ అంశం జగన్‌కు ఇబ్బందికరంగా మారింది.

దీంతో.. ఏపీ డీజీపీపై ఫైర్ అయ్యారు సీఎం. దీంతో.. డీజీపీ స్వయంగా రంగంలోకి దిగి.. కడపలోనే ఉండి సమీక్షలు చేస్తున్నారు. అయితే.. టీడీపీ నేతలు దమ్ముంటే.. వివేకా మర్డర్‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు. ఒక వేళ వేయించినా.. అప్పుడు కూడా నిజాలు బయటకు వస్తాయా..? లేక పైపైనా టెస్టులని.. కోర్టుల చుట్టూ తిప్పుతారా చూడాలి మరి ఏం జరగనుందో.

బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..