చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ లీడర్

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీ నేతలు ఒక్కరొక్కరే షాకిస్తున్నారు. ముఖ్యంగా విశాఖను 70 శాతం పరిపాలనా రాజధానిగా మారుస్తున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ఉత్తరాంధ్ర తెలుగు తమ్ముళ్ళు పార్టీ వైఖరి పట్ల గుర్రుగా వున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు విశాఖ రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పని పార్టీకి సూచించిన రెండ్రోజులకే మరో నేత విశాఖ నేత ఏకంగా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు రెహమాన్ విశాఖలో […]

చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ లీడర్
Follow us

|

Updated on: Dec 26, 2019 | 3:33 PM

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీ నేతలు ఒక్కరొక్కరే షాకిస్తున్నారు. ముఖ్యంగా విశాఖను 70 శాతం పరిపాలనా రాజధానిగా మారుస్తున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ఉత్తరాంధ్ర తెలుగు తమ్ముళ్ళు పార్టీ వైఖరి పట్ల గుర్రుగా వున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు విశాఖ రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పని పార్టీకి సూచించిన రెండ్రోజులకే మరో నేత విశాఖ నేత ఏకంగా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు రెహమాన్ విశాఖలో రాజధాని ఏర్పాటు నిర్ణయం సమంజసమైనదేనంటూ టీడీపీని వీడారు. జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారాయన. మూడు రాజధానులు ప్రతిపాదనను ఖండించమని పార్టీ తరపున ఆదేశించారని, విశాఖ నేతగా రాజధాని ఇస్తామంటే మేమెందుకు ఖండించాలని రెహమాన్ అధిష్టానాన్ని ప్రశ్నించారు.

సీనియర్ నాయకునిగా చంద్రబాబు అమరావతి రైతులకు న్యాయం చేయడానికి జగన్‌తో మాట్లాడాలని, అప్పుడే ప్రజల్లో చంద్రబాబు కు విలువ ఉంటుందని రెహమాన్ అంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు తనయుడు లోకేశ్ మీద రెహమాన్ కామెంట్స్ చేశారు. ఎన్నార్సీ, సీఏఏలపై చంద్రబాబు స్టాండ్ అడిగితే దాటేస్తున్నారని.. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే పార్టీకి దూరమవుతున్నానని చెప్పారయన.