Breaking News
  • తిరుమల: తిరుమలకు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. పద్మావతి అతిథిగృహం వద్ద సీఎంకు ఘన స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ సింఘాల్, అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి. తిరుమలకు చేరుకున్న మంత్రులు మేకతోట సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, మేకపాటి గౌతమ్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, 5.30 గంటలకు అన్నమయ్య భవన్ లోని ప్రధానిమంత్రి వీడియో కాన్ఫెరెన్స్ లో పాల్గొననున్న సీఎం జగన్ . అనంతరం 7 గంటలకు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్. శ్రీవారి దర్శనానంతరం 7.30 గంటలకు గరుడవాహనసేవలో పాల్గొననున్న సీఎం జగన్. రేపు ఉదయం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి శ్రీవారిని దర్శించుకుని నాదనీరాజనం వేదికపై సుందరకాండ పారాయణంలో పాల్గొననున్న సీఎం జగన్ . రేపు ఉదయం 8.10 గంటలకు కర్ణాటక సత్రాల నూతన సముదాయానికి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి భూమిపూజ చేయనున్న ఏపీ సీఎం జగన్.
  • చెన్నై తిరువారుర్ లో ఓఎంజిసి పైప్ లీకేజ్, ముడి చమురు తో నిండిపోయిన పొలాలు. తిరువారూర్ లో వ్యవసాయ పంటపొలాల మధ్యలో ఓఎంజిసి పైప్ లను ఏర్పాటు చేసిన ఓఎంజిసి అధికారులు . ఓఎంజిసి పైప్ పగిలిపోవడం తో భారీగా బయటికి వచ్చిన ముడి చమురు, చుట్టుపక్కల ఉన్న పంటపొలాలకు వ్యాపించడం తో ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అని భయం ఆందోళనలో గ్రామస్తులు. పచ్చటి పంటపొలాలు పూర్తిగా ముడి చమురు తో నిండిపోవడం తో తీవ్ర నష్టం వాటిల్లిందని , తమకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని రైతుల ఆందోళనలు. పంటపొలాల్లో ఉన్న ముడి చమురుని సురక్షితం గా తొలగించడానికి చర్యలు చేపట్టిన ఓఎంజిసి అధికారులు.
  • టీవీ9 తో సిటీ ED వెంకటేశ్వర రావు. సిటీ బస్సుల కు సంబంధించి ఎలాంటి నిర్ణయం జరగలేదు. తక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతామని వార్తలు వొస్తున్నాయి అందులో వాస్తవమ్ లేదు. సిటీ చివరలో 290 సర్వీసులను ఈరోజు నుండి నడుపుతున్నాం. సిటీ కి సంబంధించి చర్చ మాత్రమే జరుగుతుంది ఎలాంటి నిర్ణయం రాలేదు. మేము మాత్రం అన్ని డిపోలలో బస్సుల ను సిద్ధం చేసి ఉంచాం. కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఏర్పాట్లు కూడా చేసాం. ప్రభుత్వ ఆదేశాల కోసం చూస్తున్నాం.
  • చెన్నై : ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కి బానిసైన పోలీస్, లక్షలలో డబ్బు పోగొట్టుకొని ఆత్మహత్య . ధర్మపురి జిల్లాకి చెందిన వెంకటేసన్ , సేలం జిల్లాలోని ప్రత్యేక పోలీస్ బెట్టాలియన్ లో విధులు నిర్వహిస్తున్న వెంకటేసన్. గత కొంత కాలంగా గంటల తరబడి ఆన్లైన్ రమ్మీ ఆడుతూ లక్షలలో డబ్బులు పోగొట్టుకోవడం తో తీవ్ర మనస్థాపం . గవర్నమెంట్ హాస్టల్ తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య , కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు.
  • నిర్మల్: భైంసా మండలం కమోల్‌లో దగ్గర వాగులో చిక్కుకున్న యువకులు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా నీరు. వరద ఉధృతికి కొట్టుకుపోయిన 30 మేకలు, 10 గొర్రెలు. సాయం కోసం యువకుల ఎదురుచూపులు.
  • అమరావతి: అక్టోబర్ 2 నుంచి 'మనం-మన పరిశుభ్రత' రెండోదశ. ప్రతి మండలానికి 5 నుంచి 10 గ్రామాలలో అమలు. జూన్ 1న రాష్ట్రంలో ప్రారంభమైన మనం-మన పరిశుభ్రత. తొలిదశలో భాగంగా 1320 గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాలు. ప్రజాభాగస్వామ్యంతో పల్లెల్లో ఆరోగ్యకర వాతావరణం. 70 శాతం సీజనల్ వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట . ప్రజల నుంచి పంచాయతీలకు విరాళాలుగా రూ.1.72 కోట్లు జమ. ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రెండోదశ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు. ఈ మేరకు ప్రజాప్రతినిధులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖ.

ఇడుపులపాయ అవినీతిపై చర్యలేవీ..? వర్ల రామయ్య

, ఇడుపులపాయ అవినీతిపై చర్యలేవీ..? వర్ల రామయ్య

వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టుగా ఉందని ఏపీ ప్రజలు భావిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ప్రక్షాళన అనేది మొదట సీఎం జగన్ ఇంటినుంచి ప్రారంభించాలని ,ఇడుపులపాయ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ ముఖాన దొంగ అని ముద్ర పడింది కాబట్టి అందరికీ ఆ ముద్ర వేయాలనుకుంటున్న మూర్ఖులు మీరే అంటూ మండిపడ్డారు. ప్రజావేదిక కూల్చివేతను చూసిన ప్రజలు పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టుగా ఉందంటూ బాధపడుతున్నారని వర్ల రామయ్య ట్వీట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకరినొకరు ట్విట్టర్ వేదికగా విమర్శించుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ శ్రేణులు కూడా అదేస్ధాయిలో తిప్పి కొడుతున్నారు.

Related Tags