రాజధానిగా విశాఖ వద్దు.. బెంగళూరు ముద్దు.. టీడీపీ నేత కొత్త డిమాండ్!

ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటే..  మరికొందరు సమర్థిస్తున్నారు. అలాగే ఇంకొందరు నేతలైతే ఎవరికి తోచినట్లు వారు కొత్త కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే కోవలో తాజాగా టీడీపీ నేత తీసుకొచ్చిన ప్రతిపాదన ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. మాకు విశాఖ రాజధాని వద్దు.. బెంగళూరు రాజధాని ముద్దు అంటూ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ […]

రాజధానిగా విశాఖ వద్దు.. బెంగళూరు ముద్దు.. టీడీపీ నేత కొత్త డిమాండ్!
Follow us

|

Updated on: Jan 03, 2020 | 6:24 AM

ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటే..  మరికొందరు సమర్థిస్తున్నారు. అలాగే ఇంకొందరు నేతలైతే ఎవరికి తోచినట్లు వారు కొత్త కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే కోవలో తాజాగా టీడీపీ నేత తీసుకొచ్చిన ప్రతిపాదన ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. మాకు విశాఖ రాజధాని వద్దు.. బెంగళూరు రాజధాని ముద్దు అంటూ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

ఒకప్పుడు కర్నూలు.. ఆ తర్వాత హైదరాబాద్.. మొన్నటి దాకా అమరావతి.. ఇక ఇప్పుడు విశాఖ.. ఇలా సీఎంలు మారినప్పుడల్లా రాజధానులను మార్చడం సరికాదని తిక్కారెడ్డి అన్నారు. 1956లో మంత్రాలయం నియోజకవర్గం కర్ణాటకలోని బళ్లారి డివిజన్‌లో ఉండేదని గుర్తు చేసిన ఆయన.. విశాఖను రాజధానిగా చేస్తే రాయలసీమ వాసులు తెగ ఇబ్బందులకు గురవుతారన్నారు. మంత్రాలయం నుంచి విశాఖకు వెళ్లాలంటే సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉండగా.. ప్రయాణానికి 2 రోజులు పడుతుందన్నారు.

అందుకే కర్నూలు పార్లమెంట్‌ను కర్ణాటకలో కలిపి.. బెంగళూరును రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. ఇలా చేయడం వల్ల నీటికి, విద్యకు ఎటువంటి ఢోకా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఇప్పటికే రాజధాని మార్పుతో టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబు ఈ అంశాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంటే.. విశాఖ నేతలు సమర్థిస్తున్నారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు కర్నూలు టీడీపీ నేత తీసుకొచ్చిన ఈ కొత్త ప్రతిపాదన ఆయనకు ఇంకెన్ని చుక్కలు చూపిస్తుందో మరి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..