పీపీఏల రద్దు అందుకోసమేనా ?.. నారా లోకేశ్ ట్వీట్

ఏపీ సీఎం జగన్‌పై మరోసారి ట్వీట్ చేశారు టీడీపీ నేత, మారజీ మంత్రి లోకేశ్. ఏపీ రాజకీయాల్లో ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడంలో ముందున్న లోకేశ్ తాజాగా ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హాయంలో జరిగిన పీపీఏలను రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి మనిషికో మాట అన్నారు. నిజమే కానీ మేము మంచి మనుషులం కాదు కదా అన్నట్టుంది వైసీపీ నేతల వాలకం అంటూ ఎద్దేవా […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:00 pm, Mon, 9 September 19
TDP leader Nara Lokesh tweet on YCP

ఏపీ సీఎం జగన్‌పై మరోసారి ట్వీట్ చేశారు టీడీపీ నేత, మారజీ మంత్రి లోకేశ్. ఏపీ రాజకీయాల్లో ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడంలో ముందున్న లోకేశ్ తాజాగా ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు.

గత ప్రభుత్వ హాయంలో జరిగిన పీపీఏలను రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి మనిషికో మాట అన్నారు. నిజమే కానీ మేము మంచి మనుషులం కాదు కదా అన్నట్టుంది వైసీపీ నేతల వాలకం అంటూ ఎద్దేవా చేశారు. పీపీఏల రద్దుపై ఏపీ సీఎం చెబుతున్నదంతా తప్పుడు ప్రచారమని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ చేసిన కామెంట్‌ను లోకేశ్ ట్వీట్‌కు జతచేశారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దుచేయాలని పదే పదే కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారట.. మీ సొంత పవర్ ప్రాజెక్టులకు లాభం తెచ్చేలా కొత్త ఒప్పందాలు చేసుకోవాలనే కదా అంటూ ప్రశ్నించారు లోకేశ్.

మీ స్వార్ధం కోసం రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారని,ఇది దేశద్రోహం కాదా? లేని అవినీతిని చంద్రబాబుకు అంటగట్టాలని చూస్తే మీ నీచత్వం బయటపడుతుందని, ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలంటూ లోకేశ్ మరో ట్వీట్‌లో వైసీపీపై మండిపడ్డారు.