మన సీఎం.. ‘అక్కరకు రాని చుట్టం’ : నారా లోకేశ్

Lokesh Nara tweet on jagan america tour, మన సీఎం.. ‘అక్కరకు రాని చుట్టం’ : నారా లోకేశ్

కృష్ణా వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచినీటిని సరఫరా చేశామని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విజయవాడలో ట్యాంకర్ల ద్వారా 20 వేల లీటర్ల తాగునీటిని వరద బాధితులకు అందించారని తెలిపారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు సేవ చేయడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వివరించారు. ఈ ఏడాది అనేక రాష్ట్రాలు వరద నష్టాలను ఎదుర్కొన్నాయన్న లోకేశ్… ఆయా రాష్ట్రాల సీఎంలు అప్రమత్తంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచారన్నారు. ఇప్పటికే బాధితులకు సాయం ప్రకటించారని గుర్తు చేశారు. మన ముఖ్యమంత్రి జగన్ మాత్రం ‘అక్కరకు రాని చుట్టం’లా అమెరికాలో బిజీగా ఉన్నారని లోకేశ్ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *