భూ కబ్జా కేసులో టీడీపీ అగ్రనేత.. గోడలు కూల్చివేసిన అధికారులు

ఇప్పటికే టీడీపీ నేతలపై కేసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గత ప్రభుత్వ హయాంలో ప్లానింగ్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన అక్కినేని కుటుంబరావుపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. విజయవాడ మధురానగర్‌లో 5.10 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆ స్ధలంలో ఇప్పటికే కట్టిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసిన రెవెన్యూ అధికారులు కుటుంబరావు కుటుంబ సభ్యులు కబ్జా […]

భూ కబ్జా కేసులో టీడీపీ అగ్రనేత.. గోడలు కూల్చివేసిన అధికారులు
Follow us

| Edited By:

Updated on: Sep 13, 2019 | 6:37 PM

ఇప్పటికే టీడీపీ నేతలపై కేసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గత ప్రభుత్వ హయాంలో ప్లానింగ్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన అక్కినేని కుటుంబరావుపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. విజయవాడ మధురానగర్‌లో 5.10 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆ స్ధలంలో ఇప్పటికే కట్టిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసిన రెవెన్యూ అధికారులు కుటుంబరావు కుటుంబ సభ్యులు కబ్జా చేసినట్టు గుర్తించారు. ఆయన ప్రభుత్వ మిగులు భూమిని కబ్జా చేసినట్టు తమ విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.

ఇక ఈ భూకబ్జాపై కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవి లత వివరణ ఇస్తూ కుటుంబరావు విజయవాడ మధురానగర్‌లో కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకున్నామని, అది ప్రభుత్వ మిగులు భూమి కావడంతో ఆర్డర్ పాస్ చేసి నోటీసులు ఇచ్చినట్టుగా చెప్పారు. ఈ వివాదంలో కుటుంబరావుతో పాటు ఆయన సోదరుడు నరేంద్ర, మరో నలుగురి పేరు మీద ఉన్నట్టుగా జాయింట్ కలెక్టర్ తెలిపారు.

ఇదిలా ఉంటే తమ పరువు తీసేందుకే వైసీపీ ప్రభుత్వం ఇటువంటి పనులకు పాల్పడుతుందని ఆరోపించారు కుటుంబరావు. గతంలో రైల్వే తమ భూమిని తీసుకుందని, దానికి పరిహారం ఇవ్వకపోవడంతో ఆ భూమి తమ ఆధీనంలోనే ఉందని కుటుంబరావు వివరణ ఇచ్చారు. ఈ భూమిపై గత 46 సంవత్సరాలుగా వివాదం కొగుతుందని, తర్వాత మా భూమిని 1979లో రైల్వే శాఖ తీసుకుందని దానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా రైల్వే తమకు ఇవ్వలేదన్నారు. ఇదే విషయంపై 1996లో తమకు రావాల్సిన నష్టపరిహారంపై హైకోర్టులో కేసు వేశామని, దీనిపై సుప్రీం కోర్టు వరకు వెళ్లినా తమకే అనుకూలంగా వచ్చిందన్నారు. అప్పటి అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఈ తీర్పును ఇచ్చారని, ఈ భూమిని తిరిగి మాకే దక్కే విధంగా ఆయన తీర్పు ఇచ్చారని కుటుంబరావు తెలిపారు. అయితే ఈ కేసులో కోర్టు ఆర్డర్ 2018 సెప్టెంబర్‌లో వచ్చిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే తమ పరువు తీసేందుకు ఈ విధంగా చేస్తోందని, ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చేందుకు కబ్జా చేశారంటూ ఆరోపిస్తున్నారని కుటుంబరావు ఆరోపించారు.