మచీలీపట్నంలో ఉద్రిక్తత: కొల్లు రవీంద్ర అరెస్ట్‌..!

మచిలీపట్నంలో టీడీపీ నేతల అరెస్ట్‌లు ఉద్రిక్తతకు దారితీశాయి. రాష్ట్రంలో ఇసుక కష్టాలను ప్రశ్నిస్తూ.. కొల్లు రవీంద్ర సహా పలువురు 36 గంటల నిరవధిక దీక్షకు దిగారు. దీంతో ర్యాలీలు, సమావేశాలు నిషేధిస్తూ.. యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు పోలీసులు. ముందస్తు చర్యగా కొల్లు రవీంద్ర సహా ఇతర నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తరువాత కాసేపు కనిపించకుండా పోయిన కొల్లు రవీంద్ర.. కోనేరు సెంటర్‌లో దీక్షకు కూర్చున్నారు. అప్పటికే సిద్ధంగా ఉన్న పోలీసులు యాక్ట్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:41 am, Fri, 11 October 19
మచీలీపట్నంలో ఉద్రిక్తత: కొల్లు రవీంద్ర అరెస్ట్‌..!

మచిలీపట్నంలో టీడీపీ నేతల అరెస్ట్‌లు ఉద్రిక్తతకు దారితీశాయి. రాష్ట్రంలో ఇసుక కష్టాలను ప్రశ్నిస్తూ.. కొల్లు రవీంద్ర సహా పలువురు 36 గంటల నిరవధిక దీక్షకు దిగారు. దీంతో ర్యాలీలు, సమావేశాలు నిషేధిస్తూ.. యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు పోలీసులు. ముందస్తు చర్యగా కొల్లు రవీంద్ర సహా ఇతర నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తరువాత కాసేపు కనిపించకుండా పోయిన కొల్లు రవీంద్ర.. కోనేరు సెంటర్‌లో దీక్షకు కూర్చున్నారు. అప్పటికే సిద్ధంగా ఉన్న పోలీసులు యాక్ట్ 30ని అమలు చేస్తూ.. కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అక్కడ టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో.. కిందపడిపోయిన కొల్లు రవీంద్ర. ఆయన స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.