తుదిశ్వాస ఉన్నంత వరకు పార్టీలోనే ఉంటా.. దివ్యవాణి క్లారిటీ..

TDP Leader Gives Clarity On Party Changing Rumors, తుదిశ్వాస ఉన్నంత వరకు పార్టీలోనే ఉంటా.. దివ్యవాణి క్లారిటీ..

టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి పార్టీ వీడిబోతున్నారని.. త్వరలోనే ఆమె కమలం గూటికి చేరబోతున్నారని వస్తున్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు. ఆ వార్తల్లో నిజం లేదని.. కష్ట కాలంలో పార్టీకి అండగా ఉండాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. తుదిశ్వాస విడిచే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని దివ్యవాణి ట్వీట్ చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. సోషల్ మీడియాలో తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *