Breaking News
  • విజయనగరం: కొత్తవలస మండలం అప్పనపాలెంలో రోడ్డుప్రమాదం. ఆటోను ఢీకొన్న కారు, నలుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • అమరావతి: రేపు టీడీఎల్పీ సమావేశం. మంగళగిరి టీడీపీ కార్యాయలంలో ఉ.10:30కి సమావేశం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. మధ్యాహ్నం నుంచి ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం.
  • ఢిల్లీ: నిర్భయ కేసు. న్యాయవాది ఏపీ సింగ్‌కు బార్‌ కౌన్సిల్‌ నోటీసులు. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశం. న్యాయవాది ఏపీ సింగ్‌పై విచారణకు ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు. నిర్భయ దోషుల తరఫున వాదిస్తున్న ఏపీ సింగ్.
  • నల్గొండ: మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కులేదు-ఉత్తమ్‌. 40 లక్షల మంది ఎస్సీలకు కేబినెట్‌లో మంత్రి పదవి లేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు షాక్‌ తప్పదు-ఉత్తమ్‌కుమార్‌.
  • ఓయూ అసిస్టెంట్‌ ప్రొ.కాశిం ఇంటిపై పోలీసుల దాడిని ఖండించిన సీపీఐ. కాశిం ఇంటిపై పోలీసుల దాడి అప్రజాస్వామికం-చాడ వెంకట్‌రెడ్డి. రాష్ట్రంలో పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. కాశిం ఇంట్లో సోదాలను వెంటనే నిలిపివేయాలి-చాడ వెంకట్‌రెడ్డి.

టీడీపీ నేతలను వెంటాడుతున్న కేసులు.. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే?

West Godavari TDP leader targeted by YCP, టీడీపీ నేతలను వెంటాడుతున్న కేసులు.. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే?

పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ డీలా పడిందా.? అంటే అవునంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆ జిల్లాలో టీడీపీకి బలమైన నేతగా ఉన్న చింతమనేని ప్రభాకర్.. ఇప్పుడు జైలు పాలయ్యారు. కేసుల మీద కేసులతో చింతమనేని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మరోవైపు చింతమనేని అనుచరులపైనా వరుస కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొందరు మహిళా నేతలు సైతం ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు 150 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇంత జరుగుతున్నా… చంద్రబాబు కానీ పార్టీ సీనియర్లు కానీ బాధితుల్ని పరామర్శించిన దాఖలాలు లేవు. దీంతో జిల్లా నేతలంతా అంత యాక్టివ్‌గా లేరు. మరి కొంతమంది తాము టీడీపీ నేతలని చెప్పుకోవడానికి భయపడుతున్నట్లు తెలుస్తోంది.

ఒక్క చింతమనేని మాత్రమే కాదు.. ఆ జిల్లాలోని టీడీపీ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా టార్గెట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. చింతమనేని తర్వాత నెక్ట్స్‌ లిస్ట్‌లో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి పేరు వినిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో శుభమ్మదేవి స్కూల్‌ గ్రౌండ్‌ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. టీడీపీ నేతల చేతుల్లో ఉన్న ఈ భూమిని కార్పొరేషన్‌ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో జరిగిన గొడవలను బయటకు తీసి కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసులు తిరగతోడితే బడేటి బుజ్జి కూడా చింతమనేని చెంతకే చేరుతారని స్వయంగా జిల్లా టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. దీనితో కొందరు నేతలు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా చూస్తే పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ క్యాడర్‌ అయోమయంలో పడింది. అటు వైసీపీ జిల్లాలో టీడీపీని ఖాళీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కన్పిస్తోంది.