ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ అయ్యారు. రెండ్రోజుల క్రితమే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నకు బెయిల్ మంజూరు అయ్యింది.

ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్
Follow us

|

Updated on: Aug 31, 2020 | 4:57 PM

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ అయ్యారు. రెండ్రోజుల క్రితమే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నకు బెయిల్ మంజూరు అయ్యింది. కరోనా పాజిటివ్ రావడంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో అచ్చెన్న చికిత్సపొందుతున్నారు. పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. ఆస్పత్రి నుంచి నేరుగా అచ్చెన్నాయుడు ఇంటికి చేరుకున్నారు.

ఈఎస్‌ఐ అక్రమాల కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడు అనారోగ్యం కారణాలతో ఆస్పత్రిలో చేరారు. జ్యుడీషియల్‌ కస్టడీ సమయంలోనూ అచ్చెన్నాయుడికి రెండు మార్లు శస్త్రచికిత్స జరగడంతోపాటు కోవిడ్‌ బారినపడ్డారు. దీంతో ఆయన ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేరారు. కాగా, అచ్చెన్నాయుడ ఆరోగ్యపరిస్థితులను నేపథ్యంలో ఈఎస్‌ఐ కేసులోఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పించి బెయిల్‌ పొందాలని ఆదేశించింది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని అదేశించింది. అలాగే కేసు దర్యాప్తునకు అందుబాటులో ఉండాలని కోర్టు షరతులు విధించింది.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!