టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్‌కు అస్వస్థత..

TDP Former MP Shiva Prasad Indisposed, టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్‌కు అస్వస్థత..

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆసుపత్రి యాజమాన్యంతో ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు వైద్యులను కోరారు. అనంతరం శివప్రసాద్‌ కుటుంబసభ్యులతో కూడా ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి శివప్రసాద్ 2009,2014లో పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. స్వతహాగా నటుడైన శివప్రసాద్.. తన నిరసనలను కూడా అదే రీతిలో తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. ఆయన వివిధ రకాల వేషధారణల్లో నిరసనలు తెలిపేవారు. శివప్రసాద్ చేసిన నిరసనలు.. ఓ దశలో జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *