జైలు కైనా రెడీ: అచ్చెన్నాయుడు

Achennayudu Serious Comments On YCP Government, జైలు కైనా రెడీ: అచ్చెన్నాయుడు

పల్నాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్య పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పోలీసుల తీరుపై ఆయన చిందులు తొక్కారు. చంద్రబాబు ఇంటికి వెళ్లకుండా తనని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసుల పై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజ్ లెస్ ఫెలోస్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నివాసానికి బయలు దేరిన అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, అచ్చెన్నాయుడికి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు.

కార్యకర్తలను రక్షించుకునేందుకు తాము జైలుకైనా వెళ్లడానికి సిద్ధమని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం యొక్క తీరును చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *