ఆగ్రహం: చంద్రబాబు ఐదు వరుస ట్వీట్లు

ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టడాలు జరిపారంటూ ఈ ఉదయం ప్రభుత్వం కూల్చివేసిన విశాఖ గీతం వర్శిటీ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. “ఎంతోమంది విద్యార్ధుల చదువులకు, యువత ఉపాధికి, రోగుల వైద్యానికి దోహదపడుతోన్న విశాఖలోని అత్యున్నత ‘గీతం’ విద్యాసంస్థల కూల్చివేతలను ఖండిస్తున్నాను. కోర్టులో ఉన్న  వివాదంపై, ఎటువంటి ఆదేశాలు రాకముందే యూనివర్సిటీ కట్టడాలను కూల్చేయడం వైసిపి కక్ష సాధింపు చర్య. ప్రతిష్టాత్మక విద్యాసంస్థపై ఈ విధమైన విధ్వంసాలకు పాల్పడటం రాష్ట్ర ప్రగతికి చేటుదాయకం. మొన్న మాజీ […]

ఆగ్రహం: చంద్రబాబు ఐదు వరుస ట్వీట్లు
Follow us

|

Updated on: Oct 24, 2020 | 2:46 PM

ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టడాలు జరిపారంటూ ఈ ఉదయం ప్రభుత్వం కూల్చివేసిన విశాఖ గీతం వర్శిటీ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. “ఎంతోమంది విద్యార్ధుల చదువులకు, యువత ఉపాధికి, రోగుల వైద్యానికి దోహదపడుతోన్న విశాఖలోని అత్యున్నత ‘గీతం’ విద్యాసంస్థల కూల్చివేతలను ఖండిస్తున్నాను. కోర్టులో ఉన్న  వివాదంపై, ఎటువంటి ఆదేశాలు రాకముందే యూనివర్సిటీ కట్టడాలను కూల్చేయడం వైసిపి కక్ష సాధింపు చర్య. ప్రతిష్టాత్మక విద్యాసంస్థపై ఈ విధమైన విధ్వంసాలకు పాల్పడటం రాష్ట్ర ప్రగతికి చేటుదాయకం. మొన్న మాజీ మేయర్ సబ్బం హరి ఇంటిపై విధ్వంసం, నేడు గీతం యూనివర్సిటిలో విధ్వంసం వైసిపి కక్ష సాధింపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం. వ్యక్తులపై, పార్టీపై అక్కసుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలను గర్హిస్తున్నాం. గవర్నమెంట్ టెర్రరిజం అంటూ ఇప్పటికే విద్యా, వైద్య , పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు రావాలంటేనే భయపడే దుస్థితి ఏర్పడింది. ఇక్కడి హింసా విధ్వంసాలను చూసి బీహార్ ఆప్ సౌత్ ఇండియా  అనుకుంటూ అనేక కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కరోనా కాలంలో సామాజిక బాధ్యతగా కోట్ల రూపాయల నష్టాన్ని భరించి 2590 మంది కోవిడ్ పేషంట్లకు చికిత్స అందించింది గీతం సంస్థ. అలాంటి ఆదర్శవంతమైన సరస్వతీ నిలయాన్ని అర్థరాత్రి 200 మందితో వెళ్ళి కూల్చడం దారుణం. కట్టడం చేతగానివాళ్లకు కూల్చే హక్కులేదు. ఇప్పటికే చదువు, ఉపాధి, ఆరోగ్య చికిత్సల కోసం ఏపీ ప్రజలు పక్కరాష్ట్రాలకు పోతున్నారు. ఈ సమయంలో అటు విద్యాసేవ, ఇటు సామాజికసేవల్లో చేయూత అందిస్తూ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు గర్వకారణమై గీతం సంస్థలపై రాజకీయ కక్షసాధింపు మరో తుగ్లక్ చర్య” అంటూ చంద్రబాబు ఏకంగా ఐదు వరుస ట్వీట్లలో ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. గీతం వర్శిటీ అక్రమ నిర్మాణాలు కూల్చివేత

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..