కలవరపడుతున్న కాంగ్రెస్.. అసలు టెన్షన్ అదేనా..!

హుజూర్‌నగర్ బైపోల్.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఉపఎన్నిక ఇది. అయితే ఇప్పుడు ఈ బైపోల్ ఎన్నికతో తెలంగాణలో రాజకీయ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బరిలో అగ్ర పార్టీలన్నీ నిలబడటంతో.. గెలుపు ఎవరిదన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలే కాకుండా.. బీజేపీ, టీడీపీలు కూడా ఈ సారి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని పార్టీలు బరిలో ఉన్నా.. పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల మధ్య ఉండబోతుంది అన్నది […]

కలవరపడుతున్న కాంగ్రెస్.. అసలు టెన్షన్ అదేనా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 03, 2019 | 3:14 PM

హుజూర్‌నగర్ బైపోల్.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఉపఎన్నిక ఇది. అయితే ఇప్పుడు ఈ బైపోల్ ఎన్నికతో తెలంగాణలో రాజకీయ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బరిలో అగ్ర పార్టీలన్నీ నిలబడటంతో.. గెలుపు ఎవరిదన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలే కాకుండా.. బీజేపీ, టీడీపీలు కూడా ఈ సారి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని పార్టీలు బరిలో ఉన్నా.. పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల మధ్య ఉండబోతుంది అన్నది రాజకీయ వశ్లేషకులు అభిప్రాయం. ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా మారింది. అందుకు ముఖ్య కారణం ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడం. ఈ సీటు కోల్పోతే.. కాంగ్రెస్‌ పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది.

కారుకు జై కొట్టిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా

గత మూడు పర్యాయాలుగా ఈ హుజూర్‌ నగర్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటూ వస్తుంది. అయితే ఈ సారి మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీ హుజూర్‌నగర్‌ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పక్కా ప్లాన్లను రచిస్తోంది. ఈ ప్లాన్లతో కాంగ్రెస్‌ పార్టీకి గుబులుపుట్టుకుంది. అందుకు కారణం గతంలో కాంగ్రెస్ గెలిచింది కేవలం ఏడు వేల ఓట్ల తేడాతోనే. అయితే అప్పట్లో కాంగ్రెస్‌ ఒంటిరిగా గెలిచిన ఓట్లు కాదు. మహాకూటమిగా బరిలోకి దిగిన సమయంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీల ఓట్లు కూడా కాంగ్రెస్‌కు పడ్డాయి. అయితే ఈ సారి సీన్ రివర్స్ అయ్యింది. అప్పుడు జతకట్టిన పార్టీలు ఏవి కూడా కాంగ్రెస్‌ పక్కన లేవు. అదే సమయంలో అప్పుడు కాంగ్రెస్‌కు జై కోట్టిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ).. ఇప్పుడు కారెక్కుతానంటుంది. అధికారికంగా టీఆర్ఎస్ పార్టీకే మా మద్ధతు అని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వీరి ఓటు బ్యాంకు స్వల్పమే.. కేవలం రెండు నుంచి మూడు వేల ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే అవి ఏ పార్టీ గెలుపుకైనా కీలకమే.

కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న టీడీపీ..

ఇక అనూహ్యంగా పోటీకి దిగిన టీడీపీతో కాంగ్రెస్ కలవరపడుతోంది. దీనికి ముఖ్య కారణం టీడీపీ ఓటు బ్యాంక్.. నియోజకవర్గం కాస్త ఏపీ బార్డర్‌లో ఉండటం.. ఇక్కడ కొంచెం సీమాంధ్ర సెంటిమెంట్ ఫీలింగ్ వర్క్‌ఔట్ అవుతుందన్న భావన కలుగుతోంది. అంతేకాదు.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓట్లన్నీ దాదాపు కాంగ్రెస్ పార్టీకే పడ్డాయి. వీరి ఓటు బ్యాంకు కూడా దాదాపు వేలల్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు టీడీపీ బరిలో ఉంటే.. ఆ ఓటు బ్యాంకు అంతా కాంగ్రెస్‌కు పడకుండా టీడీపీకే పడుతుంది. దీంతో కాంగ్రెస్‌కు ప్రాణసంకటంగా మారింది టీడీపీ. అయితే టీడీపీని బరిలో ఉండకుండా వైదొలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. అది సక్సెస్ అయ్యేది కాదన్న అభిప్రాయం వెలువడుతుంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్‌కు నష్టం కలుగుతుందని… కాబట్టి ఈ విషయంలో పునరాలోచించుకోవాలని చంద్రబాబును కోరబోతున్నట్టు వార్తలు వచ్చాయి.

మరి హుజూర్ నగర్‌ స్థానాన్ని కాంగ్రెస్ సొంత ఛరిష్మాతో గట్టెక్కగలదా.. లేక సీపీఐ, టీడీపీ ఎఫెక్ట్‌తో పార్టీ కంచుకోట బద్ధలవుతుందా అన్నది తెలియాలంటే ఈ నెల 24 వరకు వేచి చూడాల్సిందే.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..