కష్టాల్లో టీడీపీ..బాలయ్య నీవెక్కడ?

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. 2014 ఎన్నికల్లో ఉభయ రాష్ట్రాల్లో సత్తాచాటిన ఆ పార్టీ..ఇప్పుడు ఏపీలో ఉనికి చాటుకోవడమే కష్టతరంగా మారింది. జగన్ వేవ్ ముందు అపర రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు పాచికలు కూడా పారలేదు. దీంతో ఎన్నడూ లేని ఊహించని పరాభవం మూటగట్టుకోవాల్సి వచ్చింది. జగన్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీలో ఉన్న కొందరు నేతలు కాషాయ కండువా కప్పుకోగా మరికొందరూ సైలెంట్‌గా అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. టీడీపీ శ్రేణుల్లో ఇప్పుడు ధైర్యం నింపాల్సిన […]

కష్టాల్లో టీడీపీ..బాలయ్య నీవెక్కడ?
Balakrishana Political Silence
Follow us

|

Updated on: Sep 14, 2019 | 5:48 AM

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. 2014 ఎన్నికల్లో ఉభయ రాష్ట్రాల్లో సత్తాచాటిన ఆ పార్టీ..ఇప్పుడు ఏపీలో ఉనికి చాటుకోవడమే కష్టతరంగా మారింది. జగన్ వేవ్ ముందు అపర రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు పాచికలు కూడా పారలేదు. దీంతో ఎన్నడూ లేని ఊహించని పరాభవం మూటగట్టుకోవాల్సి వచ్చింది. జగన్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీలో ఉన్న కొందరు నేతలు కాషాయ కండువా కప్పుకోగా మరికొందరూ సైలెంట్‌గా అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు.

టీడీపీ శ్రేణుల్లో ఇప్పుడు ధైర్యం నింపాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే ఆ పార్టీ మనుగడకే ప్రమాదం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల తమ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టారు. ‘ఛలో ఆత్మకూరు’ పేరుతో గట్టిగానే మీడియా అటెంన్షన్‌ను గ్రాబ్ చేశారు. ఆయన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు బట్ కార్యకర్తల్లో ఎవరో ఒకరు ఉత్సాహం నింపాలిగా. అటుపక్క జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలు తాను చేసుకుంటూ..ముందుకు వెళ్తున్నారు. చూస్తుంటే ఇప్పట్లో ఆయన రాజకీయాల వైపు వచ్చే ఆలోచన ఉన్నట్టు లేదు. లోకేష్ ఇంకాస్త అనుభవం సంపాదించాలి. మరి పార్టీని కాపుకాసేది ఎవరంటారా?..ఆయనే నందమూరి బాలకృష్ణ.రాష్ట్రమంతా ఎదురుగాలి తోలినా కూడా ఎన్టీఆర్ తనయుడన్న సానుభూతో, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలో తెలియదు కానీ హిందూపూర్‌ ప్రజలు  ఆశీర్వదించి గెలిపించారు. నటసింహ ఎంట్రీ ఇష్తే చాలు అక్కడ అభిమానుల కోలాహలం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆయన తిట్టినా, కొడుతున్నా ఫ్యాన్స్ మాత్రం బాలయ్యని దేవుడిలా భావిస్తారు. అదంతా పక్కన పెడితే టీడీపీ పార్టీ ఆయన తండ్రిగారైన స్వర్గీయ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. బాలయ్య ముందు ఉండి నడిపించాల్సిన భాధ్యత ఎంతైనా ఉంది. కాసీ షూటింగ్స్‌లో బిజీగా ఉంటున్న బాలయ్య టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న’ఛలో ఆత్మకూరు’  కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు.

ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కీలకంగా భావించిన నేతలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ మొదటిసారి చేపట్టిన భారీ నిరసన కార్యక్రమం కాబట్టి ఎలాగైనా సక్సెస్ చేయాలని ప్రయత్నం చేశారు. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. గృహనిర్బంధం లతోనూ, అరెస్టులతో నూ రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ పార్టీ నేతలందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఎమ్మేల్యేగా ఉన్న బాలకృష్ణ ఎక్కడా కనిపించపోవడం గమనార్హం. పార్టీ అధికారంలో ఉంటే పరువాలేదు కానీ..కార్యకర్తలపై దాడులపై జరుగుతున్నాయన్న సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత ఉందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం.

ఇటు ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గంలో ఆయప పర్యటనలు కూడా పెద్దగా లేవు. సీమలో ముగ్గురు ఎమ్మెల్యేలు గెలవగా అందులో చంద్రబాబు, పయ్యావుల కేశవ్‌తో పాటు బాలయ్య ఒకరు. దాన్ని బట్టే అర్ధమవుతుంది…కార్యకర్తలు ఆయన్ను ఎంత ఓన్ చేసుకున్నారో. దమ్మున్న నాయకుడిగా పార్టీని పటిష్టం చేయాల్సిన సమయంలో కూడా బాలకృష్ణ తనకేమీ సంబంధం లేనట్టు ప్రవర్తించడం అటు చంద్రబాబుకి సైతం ఒకింత ఇబ్బందికరంగా మారిన అంశమే. కుటుంబం మొత్తం రాజకీయాలలోనే కొనసాగుతున్నా , ఒకపక్క ఇద్దరు అల్లుళ్ళు నారా లోకేష్, శ్రీ భరత్ లు పార్టీ కోసం తమ గళాన్ని వినిపిస్తున్నా, బాలకృష్ణ పార్టీ శ్రేణులకు మద్దతుగా తమ గళాన్ని వినిపించకపోవడం పార్టీకి ఒకింత నిరాశ కలిగిస్తుంది. ఇక ఈ సమయంలోనైనా బాలయ్య రంగంలోకి దిగి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పరచాల్సిన అవసరం, తాను అండగా ఉన్నానని చెప్పాల్సిన బాధ్యత ఉంది అని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.