కార్యకర్త గిప్ట్..చంద్రబాబు భావోద్వేగం

ఏపీలో అధికార టీడీపీకి ఉన్న కార్యకర్తల బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్న ఎన్టీఆర్ నుంచి అన్ని సామాజిక వర్గాల్లోని కార్యకర్తలు టీడీపీకి కష్ట సమయాల్లో అండగా నిలుస్తూ వస్తున్నారు. నాయకులు వేరే పార్టీల్లోకి వెళ్లిపోతున్నా కూడా వారు అధినేతతోనే మా ప్రయాణం అంటూ ముందుకు నడుస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపిస్తుంటే..వారు మాత్రం టీడీపీలోని ఒక ప్రముఖ పాటలోని మాదిరిగా..ఆస్తులు కోల్పోయినా పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. తమ నాయకుడిపై కార్యకర్తలు ప్రేమను రకరకాలుగా […]

కార్యకర్త గిప్ట్..చంద్రబాబు భావోద్వేగం
Follow us

| Edited By:

Updated on: May 04, 2019 | 2:34 PM

ఏపీలో అధికార టీడీపీకి ఉన్న కార్యకర్తల బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్న ఎన్టీఆర్ నుంచి అన్ని సామాజిక వర్గాల్లోని కార్యకర్తలు టీడీపీకి కష్ట సమయాల్లో అండగా నిలుస్తూ వస్తున్నారు. నాయకులు వేరే పార్టీల్లోకి వెళ్లిపోతున్నా కూడా వారు అధినేతతోనే మా ప్రయాణం అంటూ ముందుకు నడుస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపిస్తుంటే..వారు మాత్రం టీడీపీలోని ఒక ప్రముఖ పాటలోని మాదిరిగా..ఆస్తులు కోల్పోయినా పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. తమ నాయకుడిపై కార్యకర్తలు ప్రేమను రకరకాలుగా చాటుకుంటూ ఉంటారు. కొందరూ ఫ్లెక్సీలు, కటౌట్లు వేయిస్తే..మరికొందరు అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇటీవల పార్టీ కార్యకర్త ఓ అరుదైన గిప్ట్‌ను ఇచ్చాడు. ఎవరూ ఊహించని బహుమానం ఇచ్చి అందర్నీ షాక్‌కు గురి చేశాడు.

చంద్రబాబు విషయంలో ఆయనపై విపరీతమైన అభిమానం ఉన్న ఓ కార్యకర్త రాష్ట్రం కోసం రేయిపగలు కష్టపడుతున్న చంద్రబాబు వేళకు భోజనం చేయాలనే ఆ బహుమతి ఇచ్చాడు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ముందు పాలించే చంద్రబాబు ఆరోగ్యం ఉండాలని భావించి… ఆయనకు ప్రత్యేకమైన బహుమతి ఇచ్చాడు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త రామానుజం చలపతి, చంద్రబాబుకు గడియారం, లంచ్ బాక్స్‌ను బహుమతిగా ఇచ్చాడు. తమ అధినేత వేళకు భోజనం చేసి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ ఈ బహుమతి ఇచ్చినట్లు చలపతి తెలిపారు. ఈ గిఫ్ట్ చూసిన చంద్రబాబు ఎంతగానే ఆనందించారు. ఒకింత బావోద్వేగానికి గురయ్యారు. తన ఆరోగ్యం గురించి ఇంత శ్రద్ధ తీసుకున్న కార్యకర్త చలపతిని ఆయన అభినందించారు.