Breaking News
  • అమరావతి: సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ. గాయకుడు ఎస్ పి బాల సుబ్రమణ్యం స్మృత్యర్ధం నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం నెలకొల్పాలి. కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి. కళాక్షేత్రం అభివృద్ది-ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా జయంతి, జాతీయ పురస్కారం ఏర్పాటు చేయాలి. లలిత కళలకు ప్రోత్సాహం ఇవ్వాలని లేఖలో కోరిన చంద్రబాబు.
  • హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్ . హేమంత్ కేసులో మరో ఇద్దరు ప్రమేయం ఉన్నట్లు ఆరోపిస్తున్న అవంతి. సందీప్ రెడ్డి గూడూరు, ఆశిష్ రెడ్డి ప్రమేయం కూడా ఉందంటున్న అవంతి . గతంలో హేమంత్ తండ్రితో బెదిరింపులకు దిగిన సందీప్ రెడ్డి . నాతో రెండు లక్షలు డబ్బులు తీసుకున్నాడు అంటూ నెల రోజులు క్రితం బెదిరింపులు . హేమంత్ కిడ్నాప్ అయిన రోజు సందీప్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్న గచ్చి బౌలి పోలీసులు . సందీప్ రెడ్డి నుండి నాకు ప్రాణ హాని ఉందంటున్న అవంతి.
  • చెన్నై : ఎస్పీబీ మెమోరియల్ ఫై స్పందించిన ఎస్పీ చరణ్ . నాన్నగారి అభిమానులకోసం అయన స్మారకమందిరాన్ని తప్పకుండ నిర్మిస్తాము . అయన ఎంతో ఇష్టపడే అయన ఫార్మ్ హౌస్లోనే మా సొంత ఖర్చులతో నిర్మిస్తాము . తెలుగు, తమిళ భాషలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న నాన్నగారి అభిమానులు ఆయన్ని స్మరించుకునేలా , ప్రజలు అందరూ వచ్చి సందర్శించేలా ఏర్పాటు చేస్తాము .
  • తండ్రిని చంపి పాతిపెట్టిన కొడుకు సహకరించిన తల్లి. కన్నకొడుకే తండ్రిని కిరాతకంగా అంతమొందించిన ఘటన . చేవెళ్ల‌ గుండాల గ్రామంలో ఘటన .   నెలరోజులుగా తండ్రి కనిపించకపోవడంతో బంధువులు కొడుకుని గట్టిగా నిలదీయడంగ అసలు విషయం బట్టబయలు . నెల రోజులుగా కనిపించకుండా పోయిన కిష్టయ్య. తల్లితో కలసి తండ్రిని చంపేశానని ,తమ పొలంలోనే పాతిపెట్టినట్లు అంగీకరించిన కొడుకు . మృతదేహం బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.
  • వివాదాస్పద 3 రైతు బిల్లలకు రాష్ట్రపతి ఆమోదముద్ర. గెజిట్ నోటిఫికేషన్ విడుదల. నేటి నుంచి చట్టరూపం సంతరించుకున్న బిల్లులు.
  • తూర్పు బీహార్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. ఈశాన్య జార్ఖండ్‌, ఒడిశా మీదుగా మరో ఉపరితల ద్రోణి. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు. నేడు, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు-వాతావరణశాఖ.
  • మాజీ కేంద్ర మంత్రి శ్రీ జస్వంత్ సింగ్ అకాల మృతి పట్ల సంతాపం తెలియ చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్. శ్రీ అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ, ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేసిన శ్రీ జస్వంత్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని గవర్నర్ శ్రీ హరిచందన్ తెలిపారు. శ్రీ జస్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మహిళా ఎంపీతో అసభ్య ప్రవర్తన, క్యాబ్ డ్రైవర్ అరెస్ట్

జాదవ్‌పూర్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి మిమి చక్రవర్తితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ టాక్సీ డ్రైవర్‌ను కోల్‌కతాలో పోలీసులు అరెస్ట్ చేశారు.

Cabby harasses actor-MP Mimi Chakraborty on Kolkata road, మహిళా ఎంపీతో అసభ్య ప్రవర్తన, క్యాబ్ డ్రైవర్ అరెస్ట్

జాదవ్‌పూర్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి మిమి చక్రవర్తితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ టాక్సీ డ్రైవర్‌ను కోల్‌కతాలో పోలీసులు అరెస్ట్ చేశారు. తన కారులో ప్రయాణిస్తుండగా సదరు టాక్సీ డ్రైవర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఎంపీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఈ ఘటన హరిహయత్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం జిమ్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఎంపీ మిమి చక్రవర్తి కారును ఓ టాక్సీ డ్రైవర్ ఫాలో అయ్యాడు. అంతేగాక, అతడు తన టాక్సీని.. ఎంపీ కారుకు దగ్గరగా తీసుకువచ్చి అసభ్యకరంగా సైగలు చేశారు. అయితే, తొలుత అతన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు ఎంపీ. అయినా, ఆ టాక్సీ డ్రైవర్  ఓవర్ చెయ్యడంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎంపీ ఫిర్యాదు మేరకు నిందితుడైన టాక్సీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

‘నాతో అసభ్యంగా ప్రవర్తిస్తే మొదట లైట్ తీసుకున్నా. కానీ అతడిని అలాగే వదిలేస్తే ఆ టాక్సీలో ప్రయాణించే మహిళలకు కూడా రక్షణ ఉండదని భావించి పోలీసులకు కంప్లైంట్ చేశాను. అందుకే అతడి కారును వెంబడించి పట్టుకుని మరీ పోలీసులకు అప్పగించాను’ అని మిమి చక్రవర్తి తెలిపారు. కాగా, మిమి చక్రవర్తి ఓ వైపు ఎంపీగా కొనసాగుతూనే పలు టీవీ కార్యాక్రమాల్లో కనిపిస్తున్నారు.

 

Also Read :

టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ రావు కన్నుమూత

విచారణకు పిలిస్తే, మాజీ రౌడీషీటర్ ఆగమాగం

కేసు పెట్టిన భార్య.. పీఎస్ ఎదుట భర్త ఆత్మహత్య

Related Tags