ఒకసారి ఛార్జి చేస్తే.. 300 కి.మీ దూరం.. టాటా కారు అదుర్స్..

ప్రస్తుతం ఇంధనంతో నడిచే కార్లకంటే.. ఎలక్ట్రిక్ కార్లకే డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో కంపెనీలు కూడా కస్టమర్లను ఆకర్షించేలా సరికొత్త ఫ్యూచర్స్‌తో కొత్త కార్లను మార్కెట్‌లో పరిచయం చేస్తున్నాయి. ఈ క్రమంలో టాటా మోటర్స్ కూడా సరికొత్త ఎలక్ట్రిక్ కార్‌ను త్వరలో లాంచ్ చేస్తోంది. “నిక్సన్‌ ఈవీ” అనే కొత్త రకం కారును డిసెంబర్‌ 19న మార్కెట్‌కు పరిచయం చేయనుంది. తొలుత రెండు రోజుల ముందే అనగా.. డిసెంబర్‌ 17 లాంచింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నా.. కొన్ని అనివార్య […]

ఒకసారి ఛార్జి చేస్తే.. 300 కి.మీ దూరం.. టాటా కారు అదుర్స్..
Follow us

| Edited By:

Updated on: Dec 11, 2019 | 2:41 PM

ప్రస్తుతం ఇంధనంతో నడిచే కార్లకంటే.. ఎలక్ట్రిక్ కార్లకే డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో కంపెనీలు కూడా కస్టమర్లను ఆకర్షించేలా సరికొత్త ఫ్యూచర్స్‌తో కొత్త కార్లను మార్కెట్‌లో పరిచయం చేస్తున్నాయి. ఈ క్రమంలో టాటా మోటర్స్ కూడా సరికొత్త ఎలక్ట్రిక్ కార్‌ను త్వరలో లాంచ్ చేస్తోంది. “నిక్సన్‌ ఈవీ” అనే కొత్త రకం కారును డిసెంబర్‌ 19న మార్కెట్‌కు పరిచయం చేయనుంది. తొలుత రెండు రోజుల ముందే అనగా.. డిసెంబర్‌ 17 లాంచింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నా.. కొన్ని అనివార్య కారణాలతో ఈ ప్రోగ్రాంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కాగా, ఈ “నిక్సన్ ఈవీ” కారును ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(జనవరి-మార్చి)లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కారును.. కంపెనీ సరికొత్త జిపట్రాన్‌ ఎలక్ట్రానిక్‌ పవర్‌ ట్రైన్‌ టెక్నాలజీతో తయారు చేయనున్నారు. ఇలా తయారుచేసే తొలికారు ఇదే కావడం విశేషం.

నిక్సన్ ఈవీ ప్రత్యేకతలు..

దీనిలో పర్మినెంట్‌ మాగ్నెట్‌ ఏసీ మోటార్‌ను అమర్చారు. ఇది లిథియం అయాన్‌ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీనిని ఒక సారి ఛార్జి చేస్తే.. దాదాపు 250 నుంచి 300 కి.మీ దూరం ప్రయాణించగలదు. ఈ కారు బ్యాటరీపై కంపెనీ.. 8 సంవత్సరాల వారంటీని కూడా ఇస్తోంది. ఈ బ్యాటరీలో డెడికేటెడ్ మేనేజ్‌మెంట్‌సిస్టమ్‌ను అమర్చారు. ఇది జిపట్రాన్‌ పవర్‌ట్రైన్‌ బ్యాటరీ లైఫ్‌ను పెంచుతోంది. అంతేకాదు ఇందులో.. స్పెషల్ కూలింగ్ సర్క్యూట్ ఉంది.

రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు