Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

మార్కెట్‌లోకి “5star రేటింగ్‌”తో రెండో స్వదేశీ కారు..

Tata Motors launches Altroz premium hatchback, మార్కెట్‌లోకి “5star రేటింగ్‌”తో రెండో స్వదేశీ కారు..

టాటా మోటార్స్‌ కంపెనీ నుంచి మరో సరికొత్త కారు మార్కెట్లోకి ప్రవేశించింది. బుధవారం నాడు ఆల్ట్రోజ్ ప్రీమియం హాచ్‌‌బ్యాక్‌ కారును లాంచ్ చేసింది కంపెనీ. బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన ఈ ఆల్ట్రోజ్ కారు ఎక్స్‌ షోరూం(ఢిల్లీ) ధర రూ.5.29 లక్షలు. అల్ఫా ప్లాట్‌ఫామ్‌పై మార్కెట్లోకి వచ్చిన తొలి స్వదేశీ కారు ఇదే. అంతేకాదు.. స్వదేశంలో తయారై.. ఫైవ్ స్టార్ కల్గిన కారు కూడా ఇదే కావడం మరో విశేషం. ఇది పెట్రోల్‌, డీజిల్‌ రెండు వేరియంట్లలో కూడా లభ్యం కానుంది. బీఎస్‌-6 ప్రమాణాలు గల ఈ కారు.. రిథమ్‌, స్టైల్‌, లగ్జరీ, అర్బన్‌ ప్యాక్‌లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్‌లో రూ.5.29 లక్షల నుంచి.. రూ.7.69 లక్షల వరకు ఉండగా.. డీజిల్‌ వేరియంట్‌‌లో రూ.6.99 నుంచి.. రూ.9.29 లక్షల వరకు ఉంది.

ఆల్ట్రోజ్ కారు ప్రత్యేకతలు..

*1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 86 హెచ్‌పీ పవర్
*1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్ 90 హెచ్‌పీ
* రెండు ఎయిర్‌ బ్యాగ్స్‌
* ఈబీడీతో కూడిన లేటెస్ట్ యాంటీ బ్రేకింగ్‌ సిస్టం
* హై స్పీడ్‌ లిమిటర్‌
* రేర్‌ పార్కింగ్‌ సెన్సర్స్‌
* రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్స్‌
* ఆటో క్లైమెట్‌ కంట్రోల్‌
* రేర్‌ ఏసీ వెంట్స్‌

Related Tags