తరుణ్ తేజ్ పాల్ కేసు.. విచారణ కొనసాగాల్సిందే.. సుప్రీంకోర్టు

తెహెల్కా మ్యాగజైన్ వ్యవస్థాపకుడు, మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కేసుపై విచారణ కొనసాగాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొంది. తన వద్ద పని చేసే మహిళా జర్నలిస్టుపై అత్యాచారానికి పాల్పడ్డాడని తరుణ్ తేజ్ పాల్ పై అభియోగాలు వచ్చిన సంగతి తెలిసిందే. గోవాలో ఈ కేసుకు సంబంధించి ఓ ట్రయల్ కోర్టు నిర్వహిస్తున్న విచారణను కొట్టివేయాల్సిందిగా కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పైగా ఈ కేసు విచారణలో […]

తరుణ్ తేజ్ పాల్ కేసు.. విచారణ కొనసాగాల్సిందే.. సుప్రీంకోర్టు
Follow us

|

Updated on: Aug 19, 2019 | 6:03 PM

తెహెల్కా మ్యాగజైన్ వ్యవస్థాపకుడు, మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కేసుపై విచారణ కొనసాగాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొంది. తన వద్ద పని చేసే మహిళా జర్నలిస్టుపై అత్యాచారానికి పాల్పడ్డాడని తరుణ్ తేజ్ పాల్ పై అభియోగాలు వచ్చిన సంగతి తెలిసిందే. గోవాలో ఈ కేసుకు సంబంధించి ఓ ట్రయల్ కోర్టు నిర్వహిస్తున్న విచారణను కొట్టివేయాల్సిందిగా కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పైగా ఈ కేసు విచారణలో ఇప్పటికే జాప్యం జరిగిందని, ఆరు నెలల్లోగా విచారణ ముగించాలని కూడా ఆదేశించింది. తెహెల్కా ఫౌండర్ ఎడిటర్ అయిన తరుణ్ తేజ్ పాల్ 2013 లో గోవాలో జరిగిన ఓ ఈవెంట్ సందర్భంగా ఒక మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని నాడు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈవెంట్ జరిగిన ఫైవ్ స్టార్ హోటల్ లోని ఎలివేటర్ లో ఆయన తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. పైగా అప్పట్లో ఆయన తనకు పంపిన ఈ-మెయిల్స్ వివరాలను కూడా బాధితురాలు తన సీనియర్లకు తెలియజేసింది. అప్పటి మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదరి వీటిపై స్పందించారు కూడా. ఈ ఈ-మెయిల్స్ కు సంబంధించిన అంశాలన్నీ లీక్ అయ్యాయి. సంచలనం సృష్టించిన ఈ ఉదంతం తరువాత తరుణ్ తేజ్ పాల్.. తన పదవికి రాజీనామా చేశారు. (ఆరు నెలల పాటు తన విధులకు దూరంగా ఉంటానన్నారు). అయితే బాధితురాలు చేసిన ఫిర్యాదుతో తరుణ్ తేజ్ పాల్ ను క్రైమ్ బ్రాంచి పోలీసులు 2013 నవంబరు 30 న అరెస్టు చేశారు. (ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు దరఖాస్తును కోర్టు తోసిపుచ్చింది). అయితే 2014 మే నుంచి ఆయన బెయిలుపై ఉన్నారు. గోవా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తేజ్ పాల్ పై పోలీసులు 2,684 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. ఆయన రెండు సార్లు బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డారని, ఇందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. కానీ ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని, గోవాలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష తోనే తనపై కేసు పెట్టిందని తరుణ్ తేజ్ పాల్ ఆరోపించారు. ఈ కేసును కొట్టివేయాలంటూ ఆయన 2017 లో బాంబే హైకోర్టుకెక్కగా.. అక్కడా చుక్కెదురైంది. ఆ పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో ఇక చివరి అస్త్రంగా అయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇండియాలో సెక్స్యువల్ వయొలెన్స్ మీద తెహెల్కా మ్యాగజైన్ అప్పట్లో బోలెడన్ని ఆర్టికల్స్ ప్రచురించింది. అయితే నాడు ఈ పత్రిక ఎడిటర్ మహాశయుడే తనవద్ద పని చేసే మహిళా జర్నలిస్టు పై ‘ అకృత్యానికి ‘ పాల్పడి ‘ కంచే చేను మేసిన ‘ వైనాన్ని గుర్తుకు తెఛ్చి అప్రదిష్టను మూటగట్టుకున్నాడు.

తరుణ్ తేజ్ పాల్ కేసు.. విచారణ కొనసాగాల్సిందే.. సుప్రీంకోర్టు తెహెల్కా మ్యాగజైన్ వ్యవస్థాపకుడు, మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కేసుపై విచారణ కొనసాగాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొంది. తన వద్ద పని చేసే మహిళా జర్నలిస్టుపై అత్యాచారానికి పాల్పడ్డాడని తరుణ్ తేజ్ పాల్ పై అభియోగాలు వచ్చిన సంగతి తెలిసిందే. గోవాలో ఈ కేసుకు సంబంధించి ఓ ట్రయల్ కోర్టు నిర్వహిస్తున్న విచారణను కొట్టివేయాల్సిందిగా కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పైగా ఈ కేసు విచారణలో ఇప్పటికే జాప్యం జరిగిందని, ఆరు నెలల్లోగా విచారణ ముగించాలని కూడా ఆదేశించింది. తెహెల్కా ఫౌండర్ ఎడిటర్ అయిన తరుణ్ తేజ్ పాల్ 2013 లో గోవాలో జరిగిన ఓ ఈవెంట్ సందర్భంగా ఒక మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని నాడు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈవెంట్ జరిగిన ఫైవ్ స్టార్ హోటల్ లోని ఎలివేటర్ లో ఆయన తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. పైగా అప్పట్లో ఆయన తనకు పంపిన ఈ-మెయిల్స్ వివరాలను కూడా బాధితురాలు తన సీనియర్లకు తెలియజేసింది. అప్పటి మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదరి వీటిపై స్పందించారు కూడా. ఈ ఈ-మెయిల్స్ కు సంబంధించిన అంశాలన్నీ లీక్ అయ్యాయి. సంచలనం సృష్టించిన ఈ ఉదంతం తరువాత తరుణ్ తేజ్ పాల్.. తన పదవికి రాజీనామా చేశారు. (ఆరు నెలల పాటు తన విధులకు దూరంగా ఉంటానన్నారు). అయితే బాధితురాలు చేసిన ఫిర్యాదుతో తరుణ్ తేజ్ పాల్ ను క్రైమ్ బ్రాంచి పోలీసులు 2013 నవంబరు 30 న అరెస్టు చేశారు. (ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు దరఖాస్తును కోర్టు తోసిపుచ్చింది). అయితే 2014 మే నుంచి ఆయన బెయిలుపై ఉన్నారు. గోవా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తేజ్ పాల్ పై పోలీసులు 2,684 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. ఆయన రెండు సార్లు బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డారని, ఇందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. కానీ ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని, గోవాలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష తోనే తనపై కేసు పెట్టిందని తరుణ్ తేజ్ పాల్ ఆరోపించారు. ఈ కేసును కొట్టివేయాలంటూ ఆయన 2017 లో బాంబే హైకోర్టుకెక్కగా.. అక్కడా చుక్కెదురైంది. ఆ పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో ఇక చివరి అస్త్రంగా అయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇండియాలో సెక్స్యువల్ వయొలెన్స్ మీద తెహెల్కా మ్యాగజైన్ అప్పట్లో బోలెడన్ని ఆర్టికల్స్ ప్రచురించింది. అయితే నాడు ఈ పత్రిక ఎడిటర్ మహాశయుడే తనవద్ద పని చేసే మహిళా జర్నలిస్టు పై ‘ అకృత్యానికి ‘ పాల్పడి ‘ కంచే చేను మేసిన ‘ వైనాన్ని గుర్తుకు తెఛ్చి అప్రదిష్టను మూటగట్టుకున్నాడు.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!