ఈ టారిఫ్ వార్ ఎన్నాళ్ళు ? వాణిజ్యానికి సంకెళ్ళా ?

అమెరికా, చైనా మధ్య తాజాగా ‘ వాణిజ్య పోరు ‘ ప్రారంభమైంది. తమ దేశ ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా టారిఫ్ లు పెంచడాన్ని చైనా తీవ్రంగా ఖండిస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే మరికొన్ని వస్తువులపై కొత్తగా మరో 300 బిలియన్ డాలర్ల సుంకం విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరిక పట్ల .. చైనా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మా మీద ఇలా పగ తీర్చుకోవడానికి ప్రయత్నించారంటే..మీరు ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి […]

ఈ టారిఫ్ వార్ ఎన్నాళ్ళు ? వాణిజ్యానికి సంకెళ్ళా ?
Follow us

| Edited By: Srinu

Updated on: May 14, 2019 | 6:39 PM

అమెరికా, చైనా మధ్య తాజాగా ‘ వాణిజ్య పోరు ‘ ప్రారంభమైంది. తమ దేశ ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా టారిఫ్ లు పెంచడాన్ని చైనా తీవ్రంగా ఖండిస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే మరికొన్ని వస్తువులపై కొత్తగా మరో 300 బిలియన్ డాలర్ల సుంకం విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరిక పట్ల .. చైనా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మా మీద ఇలా పగ తీర్చుకోవడానికి ప్రయత్నించారంటే..మీరు ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశం కూడా వార్నింగ్ ఇచ్చింది. పరిస్థితి మరింత విషమించకుండా చూసుకోవాలని సూచించింది. మీ దేశం నుంచి మేము దిగుమతి చేసుకునే 60 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై మేము కూడా టారిఫ్ పెంచుతామని పేర్కొంది. ఇందుకు జూన్ 1 డెడ్ లైన్ అని పేర్కొంది. చైనా ప్రధాని లీ పింగ్ ఈ నెల 10 న ట్రంప్ తో మాట్లాడిన కొన్ని గంటలకే.. అమెరికా.. 200 బిలియన్ డాలర్ల ఖరీదైన చైనా ఉత్పత్తుల మీద టారిఫ్ ను 10 నుంచి 25 శాతం మేర పెంచింది. ఇక ఇండియా విషయానికి వస్తే..ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్..భారత్ లో అమెరికన్ ఉత్పత్తులకు వాణిజ్య సంబంధ పరిమితులను తొలగించాలని కోరారు. అదే సమయంలో కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో తమ సమస్యను మళ్ళీ ప్రస్తావిస్తామని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్స్, టెలికాం ఉత్పత్తులపైనా, సెల్యులార్ ఫోన్ విడి భాగాలపైనా, స్విచ్ ల మీదా మనదేశం టారిఫ్ లను 20 శాతం పైగా పెంచింది. అయితే ఇండియా నుంచి తాము దిగుమతి చేసుకునే వస్తువులపై తాము జీరో టారిఫ్ విధించామని రాస్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇండియాను ట్రంప్ ‘ టారిఫ్ కింగ్ ‘ అని అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇండియాకు పోటీగా 30 వస్తువులపై అమెరికా ఆ మధ్య సుంకాన్ని మళ్ళీ పెంచింది. తమ దేశం నుంచి ఎగుమతి అయిన ఆటోమొబైల్స్ పై భారత్ 60 శాతం సుంకం విధించడాన్ని యూఎస్ తీవ్రంగా పరిగణించింది. మోటార్ సైకిల్స్ మీద మీరు 50 శాతం, ఆల్కహాలిక్ బెవరేజేస్ పై 150 శాతం టారిఫ్ విధిస్తారా అని ట్రంప్ భగ్గుమన్నాడు. పైగా కొన్ని వస్తువులపై 300 శాతానికి పైగా సుంకం విధించడంలోని ఔచిత్యమేమిటో చెప్పాలని రాస్ ప్రశ్నించారు. ఈ పరిణామాలు ముఖ్యంగా అమెరికా-ఇండియా మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు దేశాల మధ్య 2018 లో ద్వైపాక్షిక వాణిజ్యం 142 బిలియన్ డాలర్ల మేర జరిగిందని, అది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 16 బిలియన్ డాలర్లు ఎక్కువ అని వీరు గుర్తు చేశారు. కానీ తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇది నానాటికీ తీసికట్టే అన్నట్టు ఉందని వీళ్ళు పెదవి విరుస్తున్నారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!