తమన్నా ఔట్.. తాప్సీ ఇన్!

వరుసగా హారర్ చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ తమన్నా.. లేటెస్ట్‌గా ఓంకార్ దర్శకత్వంలో ‘రాజు గారి గది 3’ లో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైనది. ఇది ఇలా ఉండగా సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న తరుణంలో సడన్‌గా తమన్నా ఈ మూవీ నుంచి తప్పుకుంది. తాజాగా సమాచారం ప్రకారం బాలీవుడ్‌లో ఆమె ఒప్పుకున్న ‘బోలే చుడీయా’ సినిమాకు డేట్స్ క్లాష్ అవడం వల్ల ‘రాజు గారి గది’ […]

తమన్నా ఔట్.. తాప్సీ ఇన్!
Follow us

|

Updated on: Jul 03, 2019 | 1:21 AM

వరుసగా హారర్ చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ తమన్నా.. లేటెస్ట్‌గా ఓంకార్ దర్శకత్వంలో ‘రాజు గారి గది 3’ లో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైనది. ఇది ఇలా ఉండగా సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న తరుణంలో సడన్‌గా తమన్నా ఈ మూవీ నుంచి తప్పుకుంది.

తాజాగా సమాచారం ప్రకారం బాలీవుడ్‌లో ఆమె ఒప్పుకున్న ‘బోలే చుడీయా’ సినిమాకు డేట్స్ క్లాష్ అవడం వల్ల ‘రాజు గారి గది’ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తమన్నా ప్లేస్‌లో తాప్సీ‌ని ఎంపిక చేయాలని భావిస్తోందట చిత్ర యూనిట్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవనున్నాయి.