నల్లా తిప్పితే మండుతున్న నీళ్లు ! లైటర్ దగ్గర పెట్టామా అంతే సంగతులు ! ఎక్కడిదీ విచిత్రం ?

ఇళ్లలో నల్లా (కుళాయి) తిప్పి నీళ్లు పట్టుకోవాలంటే ఇప్పుడు బెదిరిపోవాల్సిందే ! ఇందుకు కారణం మంటలు మండుతూ నల్లా నీళ్లు రావడమే ! ఆ నీటి దగ్గర లైటర్ వెలిగించి పెట్టామంటే భగ్గున మంటలు ఎగసిపడుతున్నాయి..

  • Umakanth Rao
  • Publish Date - 7:17 pm, Wed, 25 November 20

ఇళ్లలో నల్లా (కుళాయి) తిప్పి నీళ్లు పట్టుకోవాలంటే ఇప్పుడు బెదిరిపోవాల్సిందే ! ఇందుకు కారణం మంటలు మండుతూ నల్లా నీళ్లు రావడమే ! ఆ నీటి దగ్గర లైటర్ వెలిగించి పెట్టామంటే భగ్గున మంటలు ఎగసిపడుతున్నాయి. విచిత్రాలకు కొదవే లేని చైనాలో జరిగిందీ డేంజరస్ ఘటన.. అక్కడి పాంజిన్ సిటీలో నివసించే ఓ మహిళ ఇంట్లో నల్లా తిప్పగానే  ఇలా మంటలతో కూడిన నీరు రావడం ప్రారంభమయిందట ! లైటర్ వెలిగించి దాని దగ్గర పెడితే బ్లో ఔట్ లా మంటలే మంటలు

! ఈ వీడియోను ఆమె సోషల్ మీడియా వెబ్ సైట్.. వీబోలో షేర్ చేసింది. కనీవినీ ఎరుగని ఈ వింత వీడియో వైరల్ అయింది.వాటర్ వర్క్స్ వారికి ఈ విషయం తెలియజేయడంతో.. బహుశా నల్లా నీటిలో సహజ వాయువు (నేచురల్ గ్యాస్)  కలిసిపోయి ఉండవచ్చునని, ఇక అలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారట 1 ఈ నీరు వాసన లేకున్నా తమ ఆరోగ్యానికి ఎక్కడ చేటు వస్తుందోనని ఆ కుటుంబం భయపడుతోంది.