Breaking News
  • తూర్పుగోదావరి: రైతు సదస్సులో జనసేన కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీకు క్రమశిక్షణ లేదంటూ కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయానన్న పవన్
  • ఢిల్లీ అగ్నిప్రమాదంపై క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు. ఫ్యాక్టరీ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు. పరారీలో ఫ్యాక్టరీ యజమాని. వారం రోజుల్లో విచరాణ పూర్తి చేయాలని ఆదేశాలు
  • అమరావతి: ఈ నెల 23 నుంచి కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన. మూడు రోజులపాటు పర్యటించనున్న వైఎస్‌ జగన్‌. జమ్మలమడుగు, పులివెందుల, కడప, మైదుకూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్న జగన్‌
  • అనంతపురం: సాకే పవన్‌ చేసిన వ్యాఖ్యలకు జనసేన మద్దతు. సాకే వ్యాఖ్యలను సమర్థించిన అనంతపురం జనసేన నేతలు. రెడ్డి సంఘం నేతలపై జనసేన నేతల ఆగ్రహం
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • మాజీ ఎంపీ కవితకు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం. ఐఎస్‌బీలో ఇండియన్‌ డెమక్రసీ ఎట్‌ వర్క్‌ సదస్సుకు ఆహ్వానం. జనవరి 9, 10 తేదీలలో జరగనున్న సదస్సు. మనీ పవర్‌ ఇన్‌ పాలిటిక్స్‌ అంశంపై ప్రసంగించనున్న కవిత
  • తూ.గో:జనసేన రైతు సదస్సును ముట్టడించిన ఎమ్మార్పీఎస్‌. పవన్‌ రైతు సదస్సులోకి చొచ్చుకొచ్చిన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు. అడ్డుకున్న జన సైనికులు, ఇరువురి మధ్య తోపులాట. సమస్యలపై పవన్‌తో మాట్లాడాలంటూ వాగ్వాదం

వంటింట్లో చప్పుడు వస్తుందని చూస్తే.. మిక్సీలో..

Snake Babies Found in Mixie Jar in Tamilnadu, వంటింట్లో చప్పుడు వస్తుందని చూస్తే.. మిక్సీలో..

పాము పేరు చెబితేనే కొందరు భయపడతారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా పాముల బెడద ఎక్కువైంది. చెట్ల పొదలు, మురుగునీరు, పొలాలు వంటి ప్రాంతాల్లో ఉండే పాములు ఇప్పుడు ఏకంగా ఇండ్లలో ప్రత్యక్ష మవుతున్నాయి. ఓ ఇంట్లో మిక్సీ జార్‌లో పాము పిల్ల బుసలు కొడుతూ కనిపించింది. అది చూసిన ఇంట్లోని వారు ఉలిక్కిపడ్డారు. తమిళనాడులోని అన్నానగర్ తునికి చెందిన మురుగన్ అనే పూల వ్యాపారి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యాపారి భార్య సెల్వి ఇంట్లో వంట చేస్తోంది. అదే సమయంలో వంట గది నుంచి ఒక్కసారిగా ఏదో పెద్ద శబ్ధం వినిపించింది. వంట గదిలో చూసే సరికి ఎక్కడో మూలన పాము శబ్దం వస్తున్నట్లు అనిపించింది. దీంతో మురుగన్ పాములు పట్టే కన్నన్ అనే వ్యక్తికి సమాచారం అందించాడు. అక్కడికి వచ్చిన అతను వంట గదిలో ఉన్న పాత్రలను చూస్తుండగా మిక్సి జార్‌లో పాము పిల్ల కనిపించింది. పాముని పట్టుకున్న కన్నన్ దాన్ని దూరంగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశాడు.