సర్కార్ స్వాధీనంలోకి జయలలిత ఇల్లు..

జ‌య‌ల‌లిత ఇంటిని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంది. ఆమె వారుసులకు సంబంధించి పరిష్కారం జరగనందున ...వేద నిలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

సర్కార్ స్వాధీనంలోకి జయలలిత ఇల్లు..
Follow us

|

Updated on: May 22, 2020 | 3:16 PM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నివాసం స్మారక మందిరంగా మారనుంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. దీంతో చెన్నైలోని తేనాంపేటలో గల పోయస్ గార్డెన్‌లో ఉన్న జయలలిత నివాసమైన వేదా నిలయం మెమోరియల్ హౌస్‌గా మారనుంది. ఈ నేపథ్యంలోనే జ‌య‌ల‌లిత ఇంటిని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంది. తమిళనాడు మాజీ సీఎం జయలలిత అనారోగ్య కారణంగా 2016 డిసెంబరు ఐదో తేదీన చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే, జయలలిత మరణానంతరం ఆస్తులపై ఆమె ప్రాణస్నేహితురాలు శశికళతోపాటు.. జయలలిత అన్న కుమార్తె దీపా పోటాపోటీగా హక్కులు ప్రకటించారు. జయలలిత ఆస్తులకు తామే వారసులమంటూ ప్రకటనలు ఇచ్చారు. కానీ, ఆమె వారుసులకు సంబంధించి పరిష్కారం జరగనందున తాత్కాలికంగా వేద నిలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. పోయెస్ గార్డెన్ లోని ఈ ఇంటిని నిర్వహించేందుకు సీఎం నేతృత్వంలో ధర్మకర్తల ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రి, సమాచార శాఖ కార్యదర్శి ధర్మకర్తలుగా ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు.