తమిళనాడు గ్రామపంచాయితీల్లో అతివలదే హవా

పల్లెల ప్రజాస్వామ్య తీరులో మార్పు వస్తోంది. గ్రామ స్వరాజ్యంలో తీరుతెన్నులు మారుతున్నాయి. ఇంతకాలం వంటింటికే పరిమితమైన మహిళల్లోనూ చక్రం తిప్పుతున్నారు.

తమిళనాడు గ్రామపంచాయితీల్లో అతివలదే హవా
Follow us

|

Updated on: Sep 18, 2020 | 5:11 PM

పల్లెల ప్రజాస్వామ్య తీరులో మార్పు వస్తోంది. గ్రామ స్వరాజ్యంలో తీరుతెన్నులు మారుతున్నాయి. ఇంతకాలం వంటింటికే పరిమితమైన మహిళల్లోనూ చక్రం తిప్పుతున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అతివలకే అగ్రతాంబూలం దక్కింది. తమిళనాడు అంతటా 27 జిల్లాల్లో ఎన్నికలు జరగగ్గా, 9,622 గ్రామ పంచాయతీ అధ్యక్షులలో 5,421 మంది మహిళలు విజయం సాధించారు. అందులో 1,817 మంది 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని ఒక నివేదికలో వెల్లడైంది.

తిరుప్పూర్ నగరానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాస్‌రూట్స్ గవర్నెన్స్ (ఐజిజి) సంస్థ నిర్వహించిన సర్వేలో అసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్న ఐజిజి ఓ స్వచ్చంధ సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ శ్రీపెరంబుదూర్ లోని రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ పూర్వ విద్యార్థులతో కలిసి తమిళనాడు గ్రామస్వరాజ్యం అభివృద్ధిపై సర్వే నిర్వహించారు. అలాగే ఆ రాష్ట్రంలో ఎన్నికైన గ్రామ పంచాయతీ అధ్యక్షుల జనాభా స్థితిపై వారు విశ్లేషించారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా సర్వేకు సంబంధించిన నివేదికను విడుదల చేశారు.

కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయితీ అధ్యక్షులు, వార్థుల సభ్యల వివరానలు సేకరించారు. వివిధ వయసుల ప్రాతినిధ్యంతో పాటు లింగ ప్రాతినిధ్యం ప్రతిపాదికన నివేదిక రూపొందించారు. గ్రామీణ స్థానికసంస్థలకు జరిగిన ఎన్నికల్లో 91,920 మందిలో గ్రామ పంచాయతీ అధ్యక్షులు ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ అధ్యక్షులలో 56% మహిళలు, 19% యువత విజయం సాధించినట్లు వెల్లడైంది. ముఖ్యంగా తమిళనాడులోని 27 జిల్లాల్లో సర్వే నిర్వహించారు. కాంచీపురం, చెంగల్పట్టు, వెల్లూరు, తిరుపత్తూరు, రాణిపేట, విల్లుపురం, కల్లకూరుచి, తిరునెల్వేలి, తెన్కాసితో సహా 27 జిల్లాల గ్రామ పంచాయతీ అధ్యక్షులకు సంబంధించిన నివేదికను ఐజీజీ రూపొందించింది. ఈ జిల్లాల్లో గ్రామీణ స్థానిక సంస్థలు ఉన్న నాగపట్నం జిల్లా ఉంది.

పంచాయతీ అధ్యక్షులలో 56.34% మహిళలు విజయం సాధించినట్లు వెల్లడించి ఐజీజీ. మొత్తం 9,622 గ్రామపంచాయితీలకు గానూ 5,421 మంది మహిళలు విజయం సాధించారు. ఇందులో 21-35 మధ్య వయస్సు గల మహిళా ప్రాతినిధ్యం ప్రబలంగా ఉంది. గతంతో పోల్చితే మహిళల ప్రాతినిధ్యం సుమారు 17% పెరిగింది. 2011లో జరిగిన గ్రామపంచాయితీ ఎన్నికల్లో 12,524 మందిలో 4,884 మంది మాత్రమే విజయం సాధించారు. అంటే సుమారు 38.99% మంది మాత్రమే గెలుపొందారు.

యువత ప్రాతినిధ్య విషయానికొస్తే, 9,622 పంచాయతీ అధ్యక్షులలో 1,817 మంది 21-35 మధ్య వయస్సు గలవారే ఎక్కువ. ఇది మొత్తం సుమారు 18.88%. 1,817 యువ పంచాయతీ అధ్యక్షులలో 1,440 మంది ఎన్నికయ్యారు. సమావేశాలకు గ్రామసభలు ముఖ్యమైనవిగా పరిగణించబడాలని అన్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?