మరణించిన ఏనుగుకు ఘనంగా వీడ్కోలు

అయినవాళ్లు దూరమైతే కనీసం చూసే పరిస్థితులు లేని ఈ రోజుల్లో ఓ ఏనుగు చనిపోతే గౌరవప్రదంగా సాగనప్పారు అటవీ అధికారులు. అనారోగ్యంతో మరణించిన ఆ ఏనుగుకు అటవీశాఖ సిబ్బంది ఘనంగా నివాళి అర్పించారు.

  • Balaraju Goud
  • Publish Date - 8:34 pm, Mon, 21 September 20
మరణించిన ఏనుగుకు ఘనంగా వీడ్కోలు

అయినవాళ్లు దూరమైతే కనీసం చూసే పరిస్థితులు లేని ఈ రోజుల్లో ఓ ఏనుగు చనిపోతే గౌరవప్రదంగా సాగనప్పారు అటవీ అధికారులు. అనారోగ్యంతో మరణించిన ఆ ఏనుగుకు అటవీశాఖ సిబ్బంది ఘనంగా నివాళి అర్పించారు. తమిళనాడులోని పొల్లాచిలో ఏనుగు సంరక్షణ కేంద్రానికి చెందిన కల్పన అనే 41 ఏండ్ల ఆడ ఏనుగు సోమవారం చనిపోయింది. ఈ ఏనుగు గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుంది. వయసు మీద పడటంతో వైద్యులచేత ప్రత్యేక కూడా అందించారు. అయినా ఫలితం లేకపోయింది. చివరికి చికిత్స పొందుతూ ఆ ఏనుగు మరణించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అధికారులతోపాటు సిబ్బంది ఈ ఏనుగుకు పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు కూడా చేశారు. ఏనుగు కల్పనతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.