ఒక్క విందు భోజనం..ఆ రైతును కోటీశ్వరుడిని చేసింది!

Tamilnadu farmer arranges lunch for villagers and gets 4 crores as gift, ఒక్క విందు భోజనం..ఆ రైతును కోటీశ్వరుడిని చేసింది!

ఒక్క విందు భోజనం పెట్టిన రైతు సాయంత్రం కల్లా కోటీశ్వరుడైపోయాడు. ఆ ముందు రోజు వరకు ఈ ఆర్థిక ఇబ్బందులతో ఎలారా వేగేది అనుకున్నోడు కాస్తా..నరసింహా సినిమా స్టైల్‌లో తెల్లారే సరికి శ్రీమంతుడిగా మారిపోయాడు. అదెలా అంటారా? అయితే ఈ స్టోరిని చదవాల్సిందే. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు విందు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే, బంధు మిత్రులు చదివింపుల ద్వారా వారికి ఆర్థిక సాయం చేస్తారు. తమిళనాడులోని పుదుక్కోట జిల్లా కీరామంగళం తాలూకాలోని వడగాడు, పరిసర గ్రామాల్లో ఈ సంప్రదాయం ఉంది. వడగాడు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి గురువారం తన బంధుమిత్రులు, గ్రామస్థులకు ఇలాగే విందు ఏర్పాటుచేశారు.

సుమారు 50,000 ఆహ్వాన పత్రికలను ముద్రించి పంచారు. విందు కోసం 1000 కిలోల మేక మాంసాన్ని సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం కోసం ఆయన రూ.15 లక్షలు ఖర్చుపెట్టారు.దాదాపు ఐదు వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారు ఇచ్చిన చదివింపుల రూపంలో కృష్ణమూర్తికి ఏకంగా రూ.4 కోట్లు వచ్చాయి. డబ్బులు లెక్కించేందుకు కౌంటింగ్ మెషిన్స్‌ను, బ్యాంకు ఉద్యోగుల సేవలను ఆయన వినియోగించుకున్నారు. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలాంటి సాంప్రదాయం మనకి కూాడా వస్తే బాగుండు అని అనుకుంటున్నారు కదా! కష్టాన్ని నలుగురు పంచుకునే ఈ ట్రెడీషన్ నిజంగా సూపరో..సూపరు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *