తమిళ డాక్టర్ వద్ద ‘కరోనా వైరస్‌’​కు మందు…!

కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో వ్యాప్తి చెందిన ఈ వైరస్ 100 సంఖ్యలో ప్రాణాలు తీసింది. అక్కడినుంచి ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ వైరస్‌కు విరుగుడు కనుక్కోడానికి పలు దేశాల్లోని వైద్యులు విశ్వప్రయత్నాలు చేస్తోన్నారు. అయితే చైన్నైలో నివశించే ఓ ఆయుర్వేద వైద్యుడు మాత్రం..తన దగ్గర డేజంరస్ కరోనాను నివారించే ఔషదముందని చెప్తున్నాడు. అది తీసుకుంటే కేవలం 24 నుంచి 48 గంటల్లోనే వ్యాధి క్యూర్ అవుతుందని భరోసా ఇస్తున్నాడు. తమిళనాడు రాజధాని చైన్నైలో […]

తమిళ డాక్టర్ వద్ద 'కరోనా వైరస్‌'​కు మందు...!
Follow us

|

Updated on: Jan 29, 2020 | 9:02 PM

కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో వ్యాప్తి చెందిన ఈ వైరస్ 100 సంఖ్యలో ప్రాణాలు తీసింది. అక్కడినుంచి ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ వైరస్‌కు విరుగుడు కనుక్కోడానికి పలు దేశాల్లోని వైద్యులు విశ్వప్రయత్నాలు చేస్తోన్నారు. అయితే చైన్నైలో నివశించే ఓ ఆయుర్వేద వైద్యుడు మాత్రం..తన దగ్గర డేజంరస్ కరోనాను నివారించే ఔషదముందని చెప్తున్నాడు. అది తీసుకుంటే కేవలం 24 నుంచి 48 గంటల్లోనే వ్యాధి క్యూర్ అవుతుందని భరోసా ఇస్తున్నాడు.

తమిళనాడు రాజధాని చైన్నైలో రత్న సిద్ద అనే ఆస్పత్రిలో డా. ధనికసాలం వేణి డాక్టరుగా సేవలందిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి విషయం తెలియగానే..దాని లక్షణాలను బట్టి వన మూలికల ద్వారా ఓ విరుగుడు ఔషదం తయారు చేసినట్టు ఆయన తెలిపారు. తన సహ డాక్టర్లు కూడా అందుకు సహకరించినట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌తో పాటు చైనా ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రస్తుతం ఆయన ప్రయత్నాలు చేస్తోన్నారు. త్వరలోనే డా. ధనికసాలం వేణి.. తన టీమ్‌తో కలిసి చైనాలో పర్యటించేందుకు భారత ప్రభుత్వం నుంచి సమ్మతి లభించినట్లు తెలుస్తోంది.