Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

తెలుగులో ఓకే.. కానీ తమిళంలో ‘సైరా’ కష్టమే..!!

ఈ నెల ఫస్ట్ వీక్‌లో తమిళ బాక్సాఫీస్ వద్ద సినిమాలు పందెంకోళ్లలా పోటీ పడబోతున్నాయి . అరవ ప్రేక్షకులకు నిండైన వినోదాన్ని పంచడానికి మూడు చిత్రాలు విడుదలవుతున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా’గా ఈ నెల రెండో తేదీన తెరపైకి వస్తోంది. వెట్రిమారన్‌, ధనుష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అసురన్‌’… జీవీ ప్రకాశ్‌ నటించిన ‘100% కాదల్‌’ 4వ తేదీన విడుదల అవుతున్నాయి.

భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘సైరా’ చిత్రాన్ని ప్యాన్‌ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి అన్ని రాష్ట్రాలకు వెళ్లి సినిమా ప్రమోషన్‌ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. తమిళంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ ట్రైలర్‌కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. మెగాస్టార్‌తో పాటు అమితాబ్‌బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, తమన్నా, సుదీప్‌లు ఉన్నందున తమిళంలో కూడా సైరాకు మంచి బజ్ ఉంది.

ఇదిలా ఉండగా, ‘అసురన్‌’లో భిన్నమైన గెటప్‌లో నటించిన ధనుష్‌ జాతీయ అవార్డుపై దృష్టి పెట్టిపెట్టినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నాలుగో తేదీన విడుదల చేయనున్నట్లు నెల క్రితమే ప్రకటించారు. 500పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతున్నట్లు సమాచారం. వెట్రిమారన్‌, ధనుష్‌ కాంబినేషన్‌ అంటేనే తప్పకుండా వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు ఎదురు చూస్తారు. ఇక తమిళ్ వాళ్లకి లోకల్ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అందుకే అవార్డు ఓరియంటడ్ మూవీగా భావిస్తున్న అసురన్‌ను హైప్ చెయ్యడానికి సైరాను సైడ్ చేస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇక తెలుగులో విజయం సాధించిన ‘100% లవ్‌’ చిత్రాన్నే ‘100% కాదల్‌’ పేరుతో తమిళ్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో నటించిన జీవీ ప్రకాశ్‌ యువతలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో. మరి తమిళ సినీ ప్రేమికులు తమ రెండు సొంత చిత్రాలతో పాటుగా సైరాను హిట్ చేస్తారా? లేక పర్సనల్‌గా తీస్కోని పక్కకి పడేస్తారో చూడాలి.