Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

‘టెంపర్‌’ రీమేక్‌… రిలీజ్ డేట్ పిక్స్

, ‘టెంపర్‌’ రీమేక్‌… రిలీజ్ డేట్ పిక్స్

చెన్నై: తెలుగువాడైనా తమిళ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్. ఓ వైపు నటన, మరోవైపు నడిగర సంఘం ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు…సోషల్ వర్క్ చేస్తూ బహుముఖ రంగాల్లో సత్తా చాటుతున్నాడు. తాజాగా  విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అయోగ్య’. తెలుగులో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘టెంపర్‌’కు ఇది రీమేక్‌. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది.

వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్‌ 19న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులను స్క్రీన్‌ సీన్‌ సంస్థ కొనుగోలు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. సామ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ‘ఠాగూర్‌’ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.