కేరళ నీళ్లొద్దన్న తమిళనాడు

తీవ్ర నీటి ఎద్దడితో తమిళనాడు రాష్ట్రం అల్లాడుతోంది. ముఖ్యంగా రాజధాని చెన్నైకు నీటిని సరఫరా చేసే అన్ని రిజర్వాయలు ఎండిపోవడంతో ఈ ఏడాది తాగునీటికి చెన్నై వాసులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి సాయం చేసేందుకు పొరుగు రాష్ట్రం కేరళ ముందుకొచ్చింది. చెన్నైకు 20లక్షల లీటర్ల నీటిని పంపుతామంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి.. ఆ రాష్ట్రానికి ఆఫర్ చేశారు. తిరువనంతపురం నుంచి ప్రత్యేక రైలులో 20లక్షల నీటిని పంపుతామని వారు పేర్కొన్నారు అయితే ఈ నీళ్లను తమిళనాడు […]

కేరళ నీళ్లొద్దన్న తమిళనాడు
Follow us

| Edited By:

Updated on: Jun 21, 2019 | 12:29 PM

తీవ్ర నీటి ఎద్దడితో తమిళనాడు రాష్ట్రం అల్లాడుతోంది. ముఖ్యంగా రాజధాని చెన్నైకు నీటిని సరఫరా చేసే అన్ని రిజర్వాయలు ఎండిపోవడంతో ఈ ఏడాది తాగునీటికి చెన్నై వాసులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి సాయం చేసేందుకు పొరుగు రాష్ట్రం కేరళ ముందుకొచ్చింది. చెన్నైకు 20లక్షల లీటర్ల నీటిని పంపుతామంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి.. ఆ రాష్ట్రానికి ఆఫర్ చేశారు. తిరువనంతపురం నుంచి ప్రత్యేక రైలులో 20లక్షల నీటిని పంపుతామని వారు పేర్కొన్నారు అయితే ఈ నీళ్లను తమిళనాడు ప్రభుత్వం తిరస్కరించింది. ఈ విషయంపై పినరయి ఆఫీసు అధికారులు ఓ ప్రకటనను చేశారు.

‘‘చెన్నైలోని పలు ప్రాంతాలు నీరు లేక ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే వారికి 20లక్షల లీటర్ల నీటిని తాము ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రతిపాదన పంపాం. అయితే ఈ ఆఫర్‌ను తమిళనాడు ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం తమకు ఎలాంటి అవసరం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది’’ అని ప్రకటనలో అధికారులు తెలిపారు. అయితే ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. కేరళ ఇచ్చిన ఆఫర్‌పై తాము ఇంకా నిర్ణయాన్ని తెలపలేదని.. ప్రస్తుతం ముఖ్యమంత్రి పళనిస్వామి ఆసుపత్రిలో ఉన్నందున, ఆయన వచ్చిన తరువాతే దీనిపై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. కాగా కేరళ ఇచ్చిన ఆఫర్‌పై తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్ ట్వీట్ చేస్తూ.. ‘‘మాకు సహాయం చేసేందుకు ముందుకొచ్చిన కేరళ ప్రభుత్వానికి థ్యాంక్స్. కేరళ ప్రభుత్వంతో తమిళనాడు ప్రభుత్వం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా’’ అంటూ పేర్కొన్నారు.