డీఎంకే చీఫ్ స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్​ అరెస్ట్.. డీఎంకే కార్యకర్తల ఆందోళన

తమిళనాడు నాగపట్టణం జిల్లాలో ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా.. డీఎంకే చీఫ్ స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు.  

  • Sanjay Kasula
  • Publish Date - 11:28 pm, Fri, 20 November 20

MK Stalin’s son Arrested : తమిళనాడు నాగపట్టణం జిల్లాలో ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా.. డీఎంకే చీఫ్ స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు.

డీఎంకే అధినేత స్టాలిన్​ కుమారుడు ఉదయనిధి స్టాలిన్​ ఆ పార్టీ యువత విభాగం చీఫ్‌గా కొనసాగుతున్నారు. నాగపట్టణం జిల్లా తిరుక్కువళైలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. తమిళనాడు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

పోలీసుల చర్యలను డీఎంకే కార్యకర్తలు ఖండిస్తూ నిరసన తెలిపారు. ప్రచారాన్ని తిరిగి శనివారం ప్రారంభిస్తామని ఉదయనిధి స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే ముందుగా ప్రచారాన్ని ప్రారంభించామని తెలిపారు.