సూర్య సినిమా రిలీజ్ పై మంత్రి అభ్యంతరం

డిజిటల్ మీడియా లో అగ్ర నటుడు సూర్య సినిమా విడుదలపై తమిళనాడు మంత్రి కడంబూర్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సమయం లో సినిమాలు ఓటీటి ప్లాట్ఫాం లో విడుదల చేయడం..

సూర్య సినిమా రిలీజ్ పై మంత్రి అభ్యంతరం
Follow us

|

Updated on: Aug 25, 2020 | 6:47 PM

డిజిటల్ మీడియా లో అగ్ర నటుడు సూర్య సినిమా విడుదలపై తమిళనాడు మంత్రి కడంబూర్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సమయం లో సినిమాలు ఓటీటి ప్లాట్ఫాం లో విడుదల చేయడం మంచిది కాదని తేల్చి చెప్పారు . దీనివల్ల థియేటర్స్ , డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు పూర్తిగా నష్టపోతారని తెలిపారు. సినిమాలను ఓటీటి ప్లాట్ఫాం లో విడుదల చేయకూడదని చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదన్న ఆయన.. కరోనా పూర్తిగా తగ్గేవరకూ ప్రభుత్వం నుండి థియేటర్స్ కి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

ఈ విషయంలో సినిమా నిర్మాతలు స్వచ్ఛందం గా థియేటర్స్ , డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు బాబోగుల గురించి అలోచించాలని కోరారు. నటుడు సూర్య, జ్యోతిక సినిమాలు డిజిటల్ మీడియా లో విడుదల చేసి ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తమిళ సినీ పరిశ్రమ వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని.. ఇటువంటి సమయం లో అందరూ సామరస్యం గా కూర్చొని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. చిత్ర పరిశ్రమ నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాల సహాయం చెస్తుందని మంత్రి కడంబూర్ రాజు హామీ ఇచ్చారు.