నెలసరి నొప్పులు తగ్గేలా టాబ్లెట్లు ఇచ్చి..

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తమ కంపెనీలో పనిచేస్తోన్న మహిళా కార్మికులకు నెలసరి నొప్పుల నుంచి విముక్తి పొందేందుకు వస్త్ర తయారీ సంస్థలు గుర్తింపు లేని మాత్రలను ఇస్తున్నాయి. దీని వలన మహిళలు నొప్పిని పొందకుండా 10గంటల పాటు పనిని చేస్తున్నారు. అయితే అప్పటికీ వారు ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందినప్పటికీ.. తెలీకుండానే జబ్బులను కొని తెచ్చుకుంటున్నారు. కానీ ఈ మాత్రల వలన నెలసరిలో తేడాలు రావడంతో పాటు గర్భస్రావం, క్యాన్సర్ వంటి రోగాలు కూడా వారికి వస్తున్నాయి.

కాగా తమ పనికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ మాత్రలు వేసుకుంటున్నామని.. అలాగే రోజువారీ కూలీలో కోత లేకుండా చూసుకునేందుకు వీటిని కొనుగోలు చేసి వాడుతున్నామని అందులో పనిచేసే ఓ కార్మికులు తెలిపింది. అయితే దీనిపై మరికొందరు మాట్లాడుతూ.. వీటిని వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తమను ఎవరూ హెచ్చరించలేదని చెబుతున్నారు. మరికొందరేమో వీటిని ఉపయోగించడం వలన మూత్రద్వారం దగ్గర ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని, వీటి వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ గురించి తాము చాలా ఆలస్యంగా తెలుసుకుంటున్నామని చెబుతున్నారు. మరోవైపు ఈ మాత్రల గురించి వైద్యులు మాట్లాడుతూ.. వీటి వలన నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందినప్పటికీ.. భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే ఆ మాత్రలపై ఎక్స్‌పైరీ డేట్ కూడా లేకపోవడం గమనర్హం. ఇదిలా ఉంటే దీనిపై తమిళనాడు ప్రభుత్వం స్పందిస్తూ.. వస్త్ర పరిశ్రమలో పనిచేసే వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిని సారిస్తామని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *