కరోనా మరణమ‌ృదంగం… ఒకే రోజు 110 మంది మ‌ృతి

తమిళనాడులో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు సుమారు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి.  ఈ ఒక్క రోజే కొత్తగా 6,272 కరోనా కేసులు, 110 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి మొత్తం సంఖ్య 2,79,144కి, మృతుల సంఖ్య 4,571కి చేరింది. కరోనా కట్టడికి తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. ఉపయోగం లేకుండా పోయింది. అధికంగా కొవిడ్ వ్యాప్తి చెందుతున్న […]

కరోనా మరణమ‌ృదంగం... ఒకే రోజు 110 మంది మ‌ృతి
Follow us

|

Updated on: Aug 06, 2020 | 8:33 PM

తమిళనాడులో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు సుమారు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి.  ఈ ఒక్క రోజే కొత్తగా 6,272 కరోనా కేసులు, 110 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి మొత్తం సంఖ్య 2,79,144కి, మృతుల సంఖ్య 4,571కి చేరింది.

కరోనా కట్టడికి తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. ఉపయోగం లేకుండా పోయింది. అధికంగా కొవిడ్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అయితే తమిళనాడు రాజధాని చెన్నైలోనే కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నాయని కొవిడ్ లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు కరోనా నుంచి ఇప్పటి వరకు 2,21,087 మంది కోలుకున్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 53,486 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 29,10,468 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో 1,68,889 మంది పురుషులు, 1,10,228 మంది స్త్రీలు, 27 మంది ట్రాన్స్‌జెండర్స్‌ ఉన్నట్లు వివరించారు.