“దక్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లంటే అంత చిన్న చూపా?”

దక్షిణాది రాష్ట్రాల సినీ పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తమిళ సినీ నిర్మాతలు, థియేటర్ ఓన‌ర్స్‌ , డిస్ట్రిబ్యూట‌ర్స్ సంఘాలు త‌ప్పుప‌డుతున్నాయి.

దక్షిణాది  సినీ ప‌రిశ్ర‌మ‌లంటే అంత చిన్న చూపా?
Follow us

|

Updated on: Sep 05, 2020 | 2:58 PM

దక్షిణాది రాష్ట్రాల సినీ పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తమిళ సినీ నిర్మాతలు, థియేటర్ ఓన‌ర్స్‌ , డిస్ట్రిబ్యూట‌ర్స్ సంఘాలు త‌ప్పుప‌డుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఐదు నెలల పాటు సినిమా షూటింగులు ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం నిబంధ‌న‌లతో షూటింగ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే థియేట‌ర్స్ తెరిచేందుకు మాత్రం ప‌ర్మిష‌న్ ఇవ్వలేదు. థియేట‌ర్స్ తెరుచుకునేందుకు అనుమతివ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

కాగా కరోనా కారణంగా సినీ పరిశ్రమలో ఉన్న లోటుపాట్ల గురించి చర్చించేందుకు కేంద్ర పెద్ద‌లు ఈనెల 8 వ తేదీన సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల‌ సినీ పరిశ్రమల‌కు చెందినవారికి పిలుపు రాకపోవడంతో వివాదం రాజుకుంది. సౌత్‌లో ఉన్న అన్ని ఇండ‌స్ట్రీల‌లో ఈ ఆవేద‌న ఉన్నా, త‌మిళ సినీ పెద్ద‌లు మాత్రం గొంతెత్తి ప్ర‌శ్నిస్తున్నారు.

భారతదేశ సినీపరిశ్రమలో ఉత్తరాది సినీ పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్య‌త‌ దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వకపోవడం బాధాకరమ‌ని తమిళ సినీ డిస్ట్రిబ్యూషన్ సంఘం అధ్యక్షుడు టి రాజేందర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మిళ‌నాడుతో పోలిస్తే తక్కువగా సినిమాలు విడుదల చేసే గుజరాత్ నుంచి రెండు సంఘాలను స‌మావేశాల‌ను ఆహ్వానించి, తమిళ పరిశ్రమకు కనీసం పిలుపు లేకపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై పునరాలోచించి దక్షిణ భారత సినీపరిశ్రలను కాపాడాలని సూచించారు.

Also Read :

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : ఇక‌పై ఆ బాధ్య‌త‌ సచివాలయాలదే

అడ్మిషన్‌ రద్దు చేసుకుంటే విద్యా సంస్థ‌లు ఫీజు వెనక్కి ఇవ్వాల్సిందే

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో క‌రోనా టెర్ర‌ర్..కేంద్రం కీల‌క ఆదేశాలు