షాకింగ్: బిగ్‌బాస్ హౌస్‌లో నటి సూసైడ్ అటెమ్ట్..!

Tamil Bigg Boss Contestant Madhumitha Attempts Suicide inside Bigg Boss 3 house, షాకింగ్: బిగ్‌బాస్ హౌస్‌లో నటి సూసైడ్ అటెమ్ట్..!

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్-3 పలు వివాదాల మధ్య హాట్ హాట్‌గా జరుగుతోంది. తాజాగా.. నాలుగోవారంలో రోహిణీ బిగ్‌బాస్ నుంచి ఔట్ అయ్యింది. అలాగే.. ఈ మధ్య తమిళ బిగ్‌బాస్ కూడా వివాదస్పదంగా మారుతోంది. గత రెండు సీజన్స్ కూడా పలు కాంట్రవర్సీలను ఎదురుకుంది తమిళ బిగ్‌బాస్. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో రోజు రోజుకీ వివాదాస్పద ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా.. ఓ తమిళనటుడు అసభ్యకరంగా మాట్లాడినందుకు తమిళ బిగ్‌బాస్ అతన్ని బయటకు పంపారు. తాజాగా.. హౌస్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. తమిళ నటి మధుమిత ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది.

Tamil Bigg Boss Contestant Madhumitha Attempts Suicide inside Bigg Boss 3 house, షాకింగ్: బిగ్‌బాస్ హౌస్‌లో నటి సూసైడ్ అటెమ్ట్..!

‘ఒరుకల్ ఒరు కన్నాడీ’ చిత్రంలో కమెడియన్‌గా నటించిన మధుమిత తమిళ బిగ్‌బాస్‌ హౌస్‌లో దాదాపు 50 రోజులు ఉంది. అనంతరం కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన ఆమె.. సడన్‌గా ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. దీంతో.. బిగ్‌బాస్ ఆమెను హౌస్ నుంచి బయటకు పంపేశాడు. ఇంటి సభ్యుల వేధింపుల కారణంగానే తాను సూసైడ్‌ అటెమ్ట్ చేసినట్టు తెలిపింది కమేడియన్ మధుమిత.

Tamil Bigg Boss Contestant Madhumitha Attempts Suicide inside Bigg Boss 3 house, షాకింగ్: బిగ్‌బాస్ హౌస్‌లో నటి సూసైడ్ అటెమ్ట్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *