Breaking News
  • శ్రీకాకుళం: కచరాంలో తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం నిర్వాకం. రోడ్లపై గుర్రపు స్వారీ నిర్వహించిన తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం. బైక్‌పై వెళ్తున్న రాంబాబు, రమాదేవి దంపతులను గుద్దిన గుర్రం. ఆస్పత్రిలో రాంబాబు పరిస్థితి విషమం. పట్టించుకోని రిసార్ట్‌ యాజమాన్యం. రాసార్ట్‌ ఎదుట స్థానికుల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తం. భారీగా మోహరించిన పోలీసులు.
  • ప.గో: తణుకు మండలం దువ్వలో పిచ్చికుక్క స్వైర విహారం. పిచ్చికుక్క దాడిలో10 మందికి గాయాలు.
  • గుంటూరు: సత్తెనపల్లిలో మహిళ ఆత్మహత్యాయత్నం. చోరీ కేసు పెట్టారన్న మనస్థాపంతో నిద్రమాత్రలు మింగిన లక్ష్మీ. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కదిరి మండలం నడిమిపల్లిలో దారుణం. యువకుడు సుధాకర్‌ గొంతు కోసిన దుండగులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్‌. గతంలో రామాంజనేయులు భార్యను ఎత్తుకెళ్లి.. తిరిగి అప్పగించిన సుధాకర్‌. రామాంజనేయులుపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.
  • అనంతపురం: హిందూపురంలో రెచ్చిపోయిన వీధికుక్కలు. ఇద్దరు చిన్నారులపై దాడి. వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారులు. ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి విషమం.
  • విజయవాడ: వంశీ వ్యాఖ్యలపై అయ్యప్ప భక్త కమిటీ అభ్యంతరం. టీవీ9 డిబేట్‌లో వంశీ అనుచిత వ్యాఖ్యలు సరికాదు. అయ్యప్ప మాలలో ఉన్న భక్తులు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. పరుష పదజాలంతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అయ్యప్ప భక్తులకు వంశీ కళంకం తెచ్చారు. ఇప్పటికైనా నియమనిష్టలతో దీక్ష చేయాలి-వేణుగోపాలస్వామి.
  • హైదరాబాద్‌: అశ్వత్థామరెడ్డి నివాసానికి వెళ్లిన ఎంపీ కోమటిరెడ్డి. అశ్వత్థామరెడ్డిని పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అందరూ ముందుకు రావాలి. అశ్వత్థామరెడ్డికి ఏం జరిగినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత. కార్మికుల సమస్యలు ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి. సడక్‌బంద్‌ను విజయవంతం చేయాలి-ఎంపీ కోమటిరెడ్డి.

అవంతికా కాదు.. “లక్ష్మీ నరసింహారెడ్డి” అంటున్న మిల్కి బ్యూటీ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. దక్షిణాది భాషలతో పాటు హిందీలో అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాక టాలీవుడ్‌లో నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా తమన్నా నటించింది. ఉయ్యాలవాడ నరసింహరెడ్డిని ఆరాధించే లక్ష్మీ పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. అంతేకాకుండా నరసింహారెడ్డి ఆంగ్లేయులతో యుద్ధం ప్రకటించిన సమయంలో ఆమె నటించిన ఒక సన్నివేశం రోమాలు నిక్కబొడిచే విధంగా ఉంటుంది. మరోవైపు వరుస ప్లాప్స్‌తో సతమతమవుతున్న తమన్నా కెరీర్‌కు ‘సైరా’ జీవం పోసినట్లయ్యింది.

తన కెరీర్‌లోనే బెస్ట్ రోల్ ఇచ్చినందుకు దర్శకుడు సురేందర్ రెడ్డికి తమన్నా ధన్యవాదాలు తెలిపారు. తను చేసిన ‘నిహారిక’, ‘అవంతిక’ వంటి క్యారెక్టర్స్ నచ్చి అభిమానులు ఆ పేర్లతో పిలిచేవారని.. అయితే ఇప్పుడు అందరూ కూడా ‘లక్ష్మీ నరసింహారెడ్డి’ అని పిలవడం చాలా గర్వంగా ఉందన్నారు. ‘సైరా’ లాంటి ఎపిక్ మూవీలో తనను భాగం చేసినందుకు చిరంజీవికి ఆమె కృతజ్ఞతలు చెప్పారు. ఈ చిత్రంలో తన లుక్‌కి ఎంతో ఆదరణ లభించిందని.. వెండితెరపై తనను అందంగా చూపించిన చిత్ర యూనిట్ అందరికి రుణపడి ఉంటానన్నారు. అంతేకాక ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్‌కు తమన్నా కాస్త భావోద్వేగానికి గురయ్యారని కూడా చెప్పొచ్చు. ఏది ఏమైనా.. బాహుబలి తర్వాత  తమన్నా చేసిన ఈ పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుందని.. సినీ ప్రముఖుల నుంచి క్రిటిక్స్ వరకు అందరూ కూడా అభినందనలు తెలుపుతుండటం చూస్తూనే ఉన్నాం.