‘ఆనందో బ్రహ్మ’ తమిళ రీమేక్‌లో మిల్కీబ్యూటీ..!

స్టార్ హీరోయిన్ తమన్నా రీసెంట్ చిత్రం ‘అభినేత్రి 2’ ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఆమె మరోసారి తమిళంలో ఓ హారర్ కామెడీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మధ్య తెలుగులో ‘ఆనందో బ్రహ్మ’ అనే హారర్ కామెడీ వచ్చి హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే సినిమాని తమిళంలో రీమేక్ చేస్తుండగా.. తాప్సి పాత్రలో తమన్నా కనిపించనుందని సమాచారం. ఈ సినిమాకి రోహిన్ వెంకటేశన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *