తమన్నా టాక్‌ షో.. ‘ఆహా’ అనిపించే రేటు..!

మిల్కీబ్యూటీ తమన్నా గురించి ఇటీవల ఓ వార్త ఫిలింనగర్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. వీరు, వారు అని తేడా లేకుండా సినీ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరితో మంచి సాన్నిహిత్యం కలిగిన తమన్నా.. ఓ టాక్‌ షో చేయబోతోందట.

తమన్నా టాక్‌ షో.. 'ఆహా' అనిపించే రేటు..!
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 5:56 PM

మిల్కీబ్యూటీ తమన్నా గురించి ఇటీవల ఓ వార్త ఫిలింనగర్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. వీరు, వారు అని తేడా లేకుండా సినీ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరితో మంచి సాన్నిహిత్యం కలిగిన తమన్నా.. ఓ టాక్‌ షో చేయబోతోందట. ఇలాంటి షోను టాలీవుడ్‌లో ఇప్పటికే రానా, మంచు లక్ష్మీ, నిహారిక వంటి వారు చేయగా.. తాజాగా ఆ లిస్ట్‌లో తమన్నా చేరబోతుందట. అంతేకాదు ఈ షోలో ఒక్కో ఎపిసోడ్‌కి ఆమెకు బాగానే ముట్టబోతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాం ఆహాకు యూజర్ల నుంచి మిక్స్‌డ్ టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తమ యూజర్లను పెంచుకునేందుకు ఆహా నిర్వాహకులు పలు ప్రణాళికలు రచిస్తున్నారట. ఈ క్రమంలో తమన్నాతో ఓ టాక్‌ షోను చేయించాలనుకున్నారట. దీనికి సంబంధించి ఆమెను సంప్రదించడం.. ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. కాగా ఇందులో ఒక్కో ఎపిసోడ్‌కి ఆమె 8 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే నిర్వాహకులు అందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులను ప్రారంభించినట్లు కూడా టాక్‌.

కాగా ఈ షోలో మొదటి ఎపిసోడ్‌కి రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి రానున్నట్లు తెలుస్తోంది. అలాగే టాప్‌ హీరో, హీరోయిన్లు తమన్నా టాక్ షోలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. అంతేకాదు యాప్‌లో ఎపిసోడ్‌లు ప్రసారం అయిన తరువాత ఓ ప్రముఖ ఛానెల్‌లోనూ ప్రసారం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్