‘బాహుబలి’ నా కెరీర్‌ని ఎంతలా మార్చిందంటే..: తమన్నా

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి టాప్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో తమన్నా ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన తమన్నా..

'బాహుబలి' నా కెరీర్‌ని ఎంతలా మార్చిందంటే..: తమన్నా
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2020 | 1:53 PM

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి టాప్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో తమన్నా ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన తమన్నా.. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తన కెరీర్‌లో బాహుబలి సినిమాలోని సన్నివేశాల కోసం చాలా కష్టపడ్డానని ఇటీవల చెప్పుకొచ్చింది ఈ మిల్కీ బ్యూటీ. బాహుబలి 1 విడుదలై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. ఈ మూవీలో అవంతిక టెస్ట్‌ లుక్‌ కోసం వెళ్లినప్పుడే ఈ పాత్ర తనకు గుర్తుండిపోయే విధంగా ఉంటుందని అనిపించిందని ఆమె అన్నారు.

ఇక ఇందులో తన ఇంట్రడక్షన్ సన్నివేశాల్లో ఫైట్‌ సీన్లు ఉంటాయని, వాటిని చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిందని తమన్నా తెలిపారు. ఇక ఈ సినిమాలో నటించిన తరువాత తాను ఎలాంటి పాత్రనైనా చేయగలనన్న నమ్మకం వచ్చిందని వివరించారు. అంతేకాదు తనపై ఉన్న గర్ల్‌ నెక్ట్స్‌ డోర్ ఇమేజ్‌ని ఈ చిత్రం తీసేసిందని తమన్నా వివరించారు.

కాగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా బాహుబలి‌ తెరకెక్కింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యంలో ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణ, నాజర్‌, సత్యరాజ్‌, అనుష్క, తమన్నా తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే.