Breaking News
  • ఏపీ గవర్నర్‌కు టీడీపీ శాసనసభాపక్షం లేఖ. లాక్‌డౌన్‌లో అందించే ఆర్థిక సాయాన్ని వైసీపీ దుర్వినియోగం చేస్తోంది. రూ.వెయ్యి, నిత్యావసరాలను దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నేతలు నగదు పంపిణీ చేస్తున్నారు. సామాజిక దూరం పాటించకుండా నగదు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు. రూ.వెయ్యి పంపిణీలో వైసీపీ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారంలా వాడుకుంటున్నారు. చట్టవ్యతిరేకంగా వ్యహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు.
  • ప.గో: ద్వారకాతిరుమలలో క్షుద్రపూజల కలకలం. చెరువువీధిలోని ఓ ఇంటి ఎదుట బొమ్మ, పసుపు, కుంకుమ.. ముగ్గు, నిమ్మకాయలతో చేతబడి చేసినట్టు అనుమానం. భయాందోళనలో గ్రామస్తులు.
  • తెలంగాణలో మర్కజ్‌ టెన్షన్‌. నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో.. ఇంకా పాజిటివ్‌ కేసులున్నాయని విచారిస్తున్న అధికారులు. మర్కజ్‌ వెళ్లొచ్చిన వాళ్లను కలిసిన పలువురిని క్వారంటైన్‌కు తరలింపు. నిన్నటి వరకు మొదటి స్టేజ్‌గా నేరుగా మర్కజ్‌ వెళ్లొచ్చిన వారితో.. సంబంధాలు ఉన్నవారి శాంపిల్స్‌ తీసుకున్న వైద్య సిబ్బంది. ఈ రోజు నుంచి రెండో స్టేజ్‌ విచారణ. నిన్న శాంపిల్స్ తీసుకున్న వారు ఎవరెవరిని కలిశారో పోలీసుల విచారణ.
  • నిజామాబాద్‌: జిల్లాలో మరో కరోనా అనుమానిత వ్యక్తి మృతి. మోపాల్‌ మండలం కంజరలో హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి మృతి. గత నెల దుబాయి నుంచి వచ్చిన వ్యక్తి. భయాందోళనలో గ్రామస్తులు.
  • వికారాబాద్‌ జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు. మర్కజ్‌ వెళ్లొచ్చిన 18 మందిలో నలుగురికి పాజిటివ్‌. వికారాబాద్‌, మర్పల్లి, పరిగి, తాండూరు వాసులుగా గుర్తింపు. నలుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు. -వికారాబాద్‌ జిల్లా వైద్యాధికారి దశరథ్‌. పరిగిలో హైఅలర్ట్‌ ప్రకటించిన పోలీసులు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిక. ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు -పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌.

ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం..ఒక్కసారైన దర్శించాలి

The India Book of Records has certified the 111.2-feet Shiva, ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం..ఒక్కసారైన దర్శించాలి

పవిత్ర కార్తీక మాసంలో ప్రపంచంలోకెల్లా ఎత్తైన మహా శివలింగం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆ ముక్కంటికి ఎంతో ప్రీతికరమైన కార్తీక సోమవారం పురస్కరించుకుని విశేష పూజాది కైంకర్యాలు నిర్వహించారు అక్కడి పూజారులు. ఇంతకీ ఈ ఎత్తైన శివలింగం ఎక్కడ ఉందో చెప్పనేలేదు కదా..! కేరళ రాజధాని తిరువనంతపురంలోని చెంగల్‌ మహేశ్వర శివపార్వతి ఆలయ ప్రాంగణంలో ఈ భారీ లింగాన్ని ప్రతిష్టించారు. ఇప్పటికే ఇండియా రికార్డ్స్‌, ఆసియా రికార్డ్స్‌లో స్థానం సంపాధించుకుంది. దేవాలయ మఠాధిపతి మహేశ్వరానంద స్వామి అక్కడ తొలిపూజ చేశారు.

వారణాసి, బద్రినాథ్‌, గంగోత్రి, గోముఖ్, రామేశ్వరం, ధనుష్‌కోటి సహా పలు హిందూ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన మట్టి, జలాన్ని  శివలింగ నిర్మాణంలో వినియోగించారు. రూ. 10 కోట్ల వ్యయంతో, 111 అడుగుల ఎత్తులో, ఎనిమిది అంతస్థులుగా దీన్ని నిర్మించారు. తొలి అంతస్తులో 108 శివలింగాలు, 8వ అంతస్తులో కైలాస నమూనాను ఏర్పాటు చేశారు. శివలింగం ఆవరణలో ధ్యాన మందిరాలను కూడా నిర్మించారు. దేశంలోనే అంత్యత ఎత్తైన శివలింగం రికార్డు ఇంతకుముందు కర్నాటకలోని కోలార్‌ జిల్లా కోటిలింగేశ్వర దేవాలయం పేరిట ఉంది. అక్కడ 108 అడుగుల శివలింగం కొలువై ఉంది. ఆ రికార్డును ఈ మహాశివలింగం అధిగమించింది.

Related Tags